అంతర్జాతీయం

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాద ముఠాల పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 12: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలు భారత్, అప్గానిస్థాన్‌లపై దాడులు చేయడానికి పథకాలు సిద్ధం చేసుకుంటున్నాయని అమెరికా ఇంటెలిజన్స్ ఉన్నతాధికారి హెచ్చరించారు. తమ భూభాగంలోని ఉగ్రవాదులను అదుపు చేయడంలో పాకిస్తాన్ ఘోరంగా విఫలమైందని కూడా ఆయన స్పష్టం చేశారు. నిఘాకు సంబంధించిన అమెరికా కాంగ్రెస్‌లోని సెనేట్ సెలెక్ట్ కమిటీ సభ్యులు జరిపిన విచారణ సందర్భంగా అమెరికా ఇంటెలిజన్స్ డైరెక్టర్ డేనియల్ కోట్స్ ఈ విషయం చెప్పారు. అంతేకాదు, పాకిస్తాన్ తన అణ్వస్త్రాల సంఖ్యను ఒక ఫథకం ప్రకారం పెంచుకుం టోందని కూడా ఆయన చెప్పారు. తన భూభాగంలోని ఉగ్రవాదులను అదుపు చేయడంలో పాక్ ఘోరంగా విఫలమైందని కోట్స్ అంటూ, ఈ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలకు ఈ ఉగ్రవాద ముఠాలు నిరంతరం ముప్పుగా మారుతున్నాయని, భారత్, అప్గానిస్థాన్‌లపై ఎప్పుడెప్పుడు దాడికి దిగుతామా అని ఎదురు చూస్తున్నాయని చెప్పారు.
కాగా, దక్షిణాసియాకు సంబంధించి అమెరికా, దాని భాగస్వాములు మిలిటరీ సహాయా న్ని గణనీయంగా పెంచినప్పటికీ 2018లో సైతం అఫ్గానిస్థాన్‌లో శాంతిభద్రతల పరిస్థితి దిగజారడం ఖాయంగా కనిపిస్తోందని ఇంటెలిజన్స్ వర్గాలు భావిస్తున్నట్లు కోట్స్ తెలిపారు. ఈ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిన దాని ఆర్థిక పరిస్థితిని సైతం పట్టించుకోకుండా చేస్తోంది. తిరుగుబాటుదారులను పూర్తిగా అదు పు చేసే దాకా, లేదా తాలిబన్ తో శాంతి ఒప్పందం కుదుర్చుకునే దాకా అఫ్గానిస్తాన్ బయ టి దేశాలనుంచి మద్దతుపై ఆధారపడక తప్పదని కూడా కోట్స్ అన్నారు. కాగా, అప్గానిస్థాన్‌లో ముఖ్యంగా గ్రామీణ ప్రాం తాల్లో తాలిబన్‌లు తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూనే ఉంటారని కూడా ఆయన అన్నారు. తాలిబన్ కార్యకలాపాలు, తీవ్రవాదులతో పోరులో సైనికులు ప్రాణాలు కోల్పోవడం, సైనికులు సైన్యా న్ని వదిలిపెట్టి వెళ్లడం, రవాణా మద్దతు లేకపోవడం, బలహీనమైన నాయకత్వం.. వీటన్నిటి కారణంగా అఫ్గానిస్థాన్ భద్రతా దళాల పని తీరు మరింతగా దిగజారవచ్చని కూడా ఆయన అభిప్రాయ పడ్డారు.
అంతర్జాతీయంగా ఏకాకిగా మారుతుండడంపై పాకిస్తాన్ ఆందోళన చెం దుతోందని, అంతర్జాతీయంగా భారత్ తన పలుకుబడిని పెంచుకోవడం, అమెరికాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం కారణంగా అంతర్జాతీయంగా తాను ఏకాకినవుతున్నానని భావిస్తున్న పాక్ బహుశా చైనాకు చేరువ కావడానికి ప్రయత్నించవచ్చని, హిందూ మహాసముద్రంలో బీజింగ్ తన పలుకుబడిని పెంచుకునేందుకు సాయపడవచ్చని కోట్స్ అభిప్రాయ పడ్డారు.
చిత్రం..డైరెక్టర్ డేనియల్ కోట్స్