అంతర్జాతీయం

బందీలందరినీ విడిపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరావి, మే 31: దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మరావి పట్టణంలో ముస్లిం మిలిటెంట్ల చేతుల్లో బందీలుగా ఉన్న 200 మందిని క్షేమంగా విడిపించి తీరుతామని ఫిలిప్పీన్స్ అధికారులు అంటున్నారు. వీరిని బందీలుగా పట్టుకున్న మిలిటెంట్ నాయకులతో చర్చలు జరపగలిగిన పక్షాలతో తాము చర్చలు జరుపుతున్నామని కూడా ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మరావి నగరంలో గత వారం రోజులుగా ముస్లిం మిలిటెంట్లకు, సైన్యానికి మధ్య జరుగుతున్న పోరులో 129 మందికి పైగా మృతి చెందారు. 90 శాతం మరావి నగరాన్ని మిలిటెంట్ల చెరనుంచి విముక్తం చేశామని సైన్యం చెప్తోంది. ఈ నగరంలో దాగి ఉన్న ప్రముఖ తిరుగుబాటు నేతను పట్టుకోవడానికి సైన్యం చేసిన యత్నాలను సాయుధ ముస్లిం మిలిటెంట్లు ప్రతిఘటించడం ఈ పోరుకు దారి తీసినట్లు సైన్యం ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ రెస్టిటిటో పడిల్లా చెప్పారు. మిలిటెంట్ నాయకుడు ఇస్నిలోన్ హపిలోన్ ఇప్పటికీ మరావిలోనే ఉన్నట్లు తెలుస్తోందని ఆయన చెప్పారు. నగరంలో చిక్కుపడిపోయిన వారిలో 960 మందిని కాపాడామని, మరో వెయ్యి మంది ఇంకా చిక్కుపడి ఉన్నారని ఆయన చెప్పారు. కాగా, గత వారం రోజులుగా జరిగిన పోరులో చనిపోయిన వారిలో 89 మంది మిలిటెంట్లు, 19 మంది పౌరులు, 21 మంది ప్రభుత్వ జవాన్లు ఉన్నారని పడిలా చెప్పారు. ఒక క్యాథలిక్ మతగురువు కూడా మిలిటెంట్ల చెరలో ఉన్నట్లుగా చెబుతున్న వీడియో నిజమైనదేనని ఆయన అంటూ, బందీలందరినీ క్షేమంగా విడిపించడానికి సైన్యం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోందని, మిలిటెంట్లతో చర్చలు జరపగల పక్షాలతో కూడా చర్చలు జరుపుతున్నామని కూడా చెప్పారు.
చిత్రం: ముస్లిం మిలిటెంట్ల చెరనుంచి ఒక చిన్నారిని రక్షించి తీసుకువస్తున్న ఫిలిప్పీన్స్ సైనికులు