మరో వివాదంలో డిజె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకపక్క డిజె లక్షల్లో లైక్స్‌తో దూసుకుపోతుంటే, మరోపక్క వివాదాలూ అంతేవేగంగా చుట్టుముడుతున్నాయి. ఆమధ్య విడుదల చేసిన పాట ప్రొమో ‘శరణం భజే’ ఇప్పటికి 30 లక్షల వ్యూస్ దాటేస్తే, తాజాగా విడుదల చేసిన సాంగ్ ప్రోమో ‘గుడిల బడిలో వొడిలో’ ఐదు లక్షల వ్యూస్ దాటింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్దె హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం దువ్వాడ జగన్నాథం. చిత్రంలో బ్రాహ్మణ కుర్రాడి పాత్రను పోషిస్తున్నాడు అల్లు అర్జున్. ఈ చిత్రం కోసం రూపొందించిన ‘అస్మైక యోగ, తస్మైక భోగ’ పాటలో ‘ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం.. ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకించింది ఆ చమకం’ అంటూ శివుడికి ప్రీతికరమైన నమక, చమకాలను శృంగాపరంగా ప్రస్తావించడంపై బ్రాహ్మణ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రుషిపరంపరను, గోత్రనామాలను తెలిపే ‘పవర’లో ప్రణయ మంత్రాలు ఉంటాయంటూ ప్రస్తావించటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభ్యంతరకరమైన ప్రస్తావనలతో రూపొందించిన పాటలను వెంటనే నిలుపుదల చేయాలని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి సెన్సార్ బోర్డుకు విజ్ఞప్తి చేసింది. పాటను నిలుపుదల చేయకుంటే రాష్టవ్య్రాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలకు దిగుమతాని బ్రాహ్మణ సేవా సమితి గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ ఒక ప్రకటనలో హెచ్చరించారు. గత ఫిబ్రవరిలో కర్నాటకలో షూటింగ్ జరుగుతున్నపుడూ ‘డిజె’పట్ల వ్యక్తిరేకతలు వ్యక్తమయ్యాయి. అక్కడి చెన్నకేశవ ఆలయంలో షూటింగ్ జరిపేందుకు అనుమతులు తీసుకున్నా, ఆలయ పరిసరాల్లో ప్రత్యేకంగా శివలింగాన్ని ఏర్పాటు చేయటంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆందోళనలకు దిగటంతో అక్కడి షూటింగ్ రద్దు చేసుకుని, తెలుగు రాష్ట్రాల్లోనే ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు. షూటింగ్ పూర్తయ్యేసరికి ‘డిజె’ ఇంకెన్ని వివాదాల్లో ఇరుక్కుంటాడోనని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది.