అంతర్జాతీయం

బౌద్ధాలయానికి మోదీ కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ పీటర్స్‌బర్గ్, జూన్ 2: రష్యాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని దాత్సన్ గుంజెచోయినీ బౌద్ధ ఆలయం ప్రధాన పూజారి జంపా డోనోర్‌కు బౌద్ధులు ఎంతో పవిత్రంగా భావించే ‘శత పిటక’ (ఉర్గా కంజూర్) గ్రంథం టిబెట్ భాష ప్రతిని బహూకరించారు. వంద వాల్యూమ్‌లకు పైగా ఉండే ఈ టిబెటన్ కంజూర్ ఉర్గా ప్రతి గురించి 1955 వరకు కూడా ఎవరికీ తెలియదు.
అప్పట్లో ప్రొఫెసర్ రఘువీర్ 104 వాల్యూమ్‌లు కలిగి ఉన్న ఈ మొత్తం గ్రంథాన్ని భారత్‌కు తీసుకు వచ్చారు. కేటలాగ్ కోసం ప్రత్యేకంగా ఒక వాల్యూమ్ కూడా దీనిలో ఉంది. మంగోలియా ప్రధానమంత్రి ఆయనకు ఈ అరుదైన గ్రంథాన్ని కానుకగా ఇచ్చారు. కాగా, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని స్టేట్ హెర్మిటేజ్ మ్యూజియంను కూడా సందర్శించిన ప్రధాని తన సందర్శనకు సం బంధించిన కొన్ని ఫోటోలను సైతం ట్విట్టర్‌లో ఉంచారు. రష్యాలో తన రెండో రోజు పర్యటనలో భాగంగా మోదీ నగరంలోని ప్రాచీన భాషల రాతప్రతుల భాండాగారాన్ని కూడా సందర్శించారు. ఈ భాండాగారంలో 65కు పైగా జీవంత, మృత భాషలకు చెందిన రాతప్రతులు, గతంలో ముద్రించిన గ్రంథాలు లక్షకు పైగా ఉన్నాయి. అత్యంత విలువైన డాక్యుమెంట్లు కూడా అందులో ఉన్నాయి. మోదీ అక్కడ విజిటర్స్ బుక్‌లో గుజరాతీలో ఒక సందేశం కూడా ఉంచారు.