అదీ కాలా రూటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాలా’. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే ముంబైలో ప్రారంభమైన విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ షెడ్యూల్ బుధవారంతో ముగిసింది. ఈ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలతోపాటు ముంబైలోని మెరైన్ డ్రైవ్ వద్ద యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. షూటింగ్ ముగియడంతో చెన్నైకి చేరుకున్న రజనీ ఈనెల 15 నుంచి వరుసగా మూడు రోజులపాటు మళ్లీ అభిమానులను కలవనున్నారు. ఇదివరకే జరిగిన ఫ్యాన్స్ మీట్‌లో రాజకీయ రంగం ఎంట్రీ గురించి మాట్లాడిన రజనీ, ఆ విషయంపై వచ్చిన విమర్శలతోపాటు సమస్యలను పరిష్కరించనున్నారట. అయితే, ఈ మీటింగ్‌లోనే ఆయన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటిస్తారని తెలిసింది. మొత్తానికి ఆగస్టులో కొత్త పార్టీని స్థాపిస్తాడంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.