అంతర్జాతీయం

120 మంది జలసమాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంగోన్, జూన్ 7: దాదాపు 120 మంది ప్రయాణికులతో వెళ్తున్న మయన్మార్ సైనిక విమానం ఒకటి బుధవారం అండమాన్ సముద్రంలో కూలిపోయింది. వందమందికి పైగా సైనికులు, వారి కుటుంబ సభ్యులతో వెళ్తున్న ఈ విమానం శకలాలను అండమాన్ సముద్రంలో కనుగొన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. దావీ నగరానికి 136 మైళ్ల దూరంలో అండమాన్ సముద్రంలో కూలిపోయిన విమానం తాలూకు శకలాలు కనిపించినట్లు పర్యాటక శాఖ అధికారి నయింగ్ లిన్ జా చెప్పారు. నౌకాదళానికి చెందిన 4 నౌకలు, విమానాలు ఇంకా సముద్ర ఉపరితలంపై గాలింపు జరుపుతున్నాయని, అయితే ఎవరూ ప్రాణాలతో బతికి ఉన్న జాడలు కనిపించడం లేదని అధికారులు చెప్పారు. దీంతో విమానంలోని అందరూ జలసమాధి అయి ఉంటారని భావిస్తున్నారు. బుధవారం మైటేక్ నగరంనుంచి యాంగోన్‌కు వెళ్తుండగా స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.35 గంటల ప్రాంతంలో విమానానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. మొదట్లో ఈ విమానంలో ఎంతమంది ఉన్నారనే దానిపై పరస్పర విరుద్ధమైన కథనాలు వచ్చాయి. అయితే 12 మంది పిల్లలు మాత్రం ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. సైనికులు వారి కుటుంబ సభ్యులతో కలిపి 106 మంది ప్రయాణికులు, 14 మంది విమాన సిబ్బంది విమానంలో ఉన్నట్లు చివరికి అధికారిక వర్గాలు తెలియజేశాయి. జాడ తెలియకుండా పోయే సమయానికి విమానం 18 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్నట్లు వైమానిక దళ అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురయిన విమానం చైనాలో తయారైన వై-8ఎఫ్-200 రకందని, గత ఏడాదే ఈ విమానాన్ని డెలివరీ చేశారని ఆర్మీ వర్గాలు తెలిపాయి.