విజయవాడ

సామాజిక సమస్యలను ప్రతిబింబించిన నాటకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కల్చరల్), జూన్ 9: రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శా ఖ, ఎపి చలనచిత్ర, టివి నాటక రంగ అభివృద్ధి సంస్థల సహకారంతో హర్ష క్రియేషన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ 3 రోజులపాటు గాంధీనగరంలోని హనుమంతరాయ గ్రంథాలయం హా లులో నిర్వహిస్తున్న ప్రథమ, రాష్ట్ర సా థయి ఆహ్వాన సాంఘిక నాటికల పోటీలలో 2వ రోజు శుక్రవారం నాటి ప్రదర్శనలు సామాజిక సమస్యలను ప్రతిబింబించాయి. అసోసియేషన్ అధ్యక్షు డు కత్తి శ్యాం ప్రసాద్, కార్యదర్శి పిళ్లా నటరాజ్‌ల పర్యవేక్షణలో ప్రథమ ప్రదర్శనగా శ్రీమణికంఠ ఆర్ట్స్ (పిఠాపురం) సమర్పణలో ఇదీ నిజం నాటిక ప్రదర్శితమైంది. చెలికాని వెంకట్రావు రచించి దర్శకత్వం వహించగా నటీనటులుగా చెలికాని వెంకట్రావు, నాగాభట్ల రఘు, కె.నాగేశ్వరరావు, రావు రాజేష్, సురభి ప్రభావతి, గుడివాడ లహరిలు శాస్త్రా లు, కులాలు, మతాలు, నమ్మకాలు, సి ద్ధాంతాలు వీటన్నిటికంటే త్యాగం గొ ప్పదని త్యాగం, సాయం మనిషిని మ హనీయుడిని చేస్తాయనే ఇతివృత్తంతో నటించారు. ద్వితీయ ప్రదర్శనగా లిఖితసాయి క్రియేషన్స్ సమర్పణలతో మాకంటూ ఓ రోజు నాటిక దండు నా గేశ్వరరావు రచించగా జె.సుబ్రహ్మణ్య సతీష్ దర్శకత్వం వహించగా ప్రదర్శితమైంది. నటీనటులుగా జె.సుబ్రహ్మణ్య సతీష్, సురభి ప్రభావతి, జె.శరవణశాస్ర్తీ, కె.లక్ష్మణరావు, పి.వరప్రసాద్‌లు రైతుల ఆర్థిక ఇబ్బందులు, ఎదుర్కొంటున్న కష్టాలు, నష్టాలు ఎప్పటికి పోతాయని, వారి కంట నీరు తుడిచేదెవ్వరనే ఇతివృత్తంతో నటించారు. తృతీయ ప్రదర్శనగా కృష్ణా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (గుడివాడ) సమర్పణలో పివి సత్యనారాయణ రచించిన పి.కృష్ణ సితేష్ దర్శకత్వం వహించిన అభయ నాటిక ఒంటరితనం మనిషిని ఎలా చిత్రవధ చేస్తుందోనని తెలుపుతూ ప్రదర్శితమవుతుంది. నటీనటులుగా శీరం శ్రీనివాసరావు, గుడివాడ లహరి, పివి సత్యనారాయణ, శొంఠి శ్రీనివాస్, నాగసాయి, ఆర్‌విఎల్ నరసింహరావులు వారి వారి పాత్రలలో నటించారు. ఇదే వేదికపై పేద విద్యార్థులకు ఆర్థిక సాయం, 2017లో నంది అవార్డులు పొందిన నగర రంగస్థల నటులు అమృతవర్షిణి, ఎంఎస్ చౌదరిలను ఘనంగా అభినందిస్తూ సత్కరించారు. ఏడుగురు నాటక రంగంలో నిత్య కృషీవలురకు లాంఛనప్రాయ సత్కారం జరిగింది.