జార్జియాలో గరుడవేగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు 33 రోజులపాటు జార్జియాలో చేశారు. భారతీయ చిత్రాల్లో ఇప్పటివరకూ వెండితెరపై కనిపించని పలు అందమైన లూకేషన్‌లలో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు తెలియజేశారు. యూరాషియన్ దేశంలో 33 రోజులపాటు షూటింగ్ చేశారు. స్క్రిప్ట్ డిమాండ్‌ను బట్టి వాతావరణాన్ని పట్టించుకోకుండా షూటింగ్ చేశామని, సెన్సిటివ్ ఏరియాలలో కూడా అక్కడి ప్రభుత్వం షూటింగ్‌కు అనుమతినిచ్చిందని, వారి సపోర్టు మరువలేనిదని దర్శకుడు తెలిపాడు. తాము పనిచేసిన లొకేషన్ పరిధిలో 100 కి.మీ పరిధిలో హోటళ్లు కూడా లేవని, అయినా కానీ టీమ్ అందరం కలిసి క్యాంపులోనే ఉండి షూటింగ్ చేశామని కథానాయకుడు రాజశేఖర్ అన్నారు. తన కెరీర్‌లో భారీ వ్యయంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో జార్జియా షెడ్యూల్ హైలెట్‌గా వుంటుందని, 25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆయన అన్నారు. అతిథి, పూజాకుమార్, శ్రద్ధాదాస్, కిషోర్, నాజర్, పోసాని కృష్ణమురళి, అలి, పృధ్వీ, షాయాజీ షిండే, అవసరాల శ్రీనివాస్, శతృ, సంజయ్ స్వరూప్, రవివర్మ, ఆదర్శ్, చరణ్‌దీప్, రవిరాజ్ తదితరులు నటిస్తున్నారు.