మేడమీద అబ్బాయి కనిపించాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్, నిఖిలా విమల్ జంటగా జాహ్నవి ఫిలింస్ పతాకంపై జి.ప్రజీత్ దర్శకత్వంలో బొప్పన చంద్రశేఖర్ రూపొందిస్తున్న చిత్రం ‘మేడమీద అబ్బాయి’. ఈ చిత్రానికి సంబంధించిన ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తిచేశారు. దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ జయంతి సందర్భంగా శనివారం ఉదయం సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ- కొత్తదయిన కథ, కథనాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని వైవిధ్యంగా రూపొందించారని, గమ్యం, శంభో శివశంభో తరువాత అలాంటి శక్తివంతమైన పాత్రలో నరేష్ నటిస్తున్నాడని తెలిపారు. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే హైలెట్‌గా వుంటుందని, అలాగే నరేష్ తరహా కామెడీ కూడా ఉంటుందని ఆయన అన్నారు. బ్యాలెన్స్‌గా వున్న పాటను త్వరలో పూర్తిచేసి ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన అన్నారు. అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సుధ, సత్యం రాజేష్, మధునందన్, ఆది, పద్మ, జయంతి, రవిప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు:చంద్రశేఖర్, కెమెరా:ఉన్ని ఎస్.కుమార్, సంగీతం:షాన్ రెహమాన్, ఎడిటింగ్:నందమూరి హరి, నిర్మాత:బొప్పన చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:జి.ప్రజీత్.