ఖయ్యూం భాయ్ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్యాంగ్‌స్టర్ నరుూం జీవిత కథ ఆధారంగా కట్టా రాంబాబు టైటిల్ రోల్ పోషిస్తూ నటిస్తున్న చిత్రం ‘ఖయ్యూం భాయ్’. భరత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సాయి ఊహ క్రియేషన్స్ పతాకంపై కట్టా శారద నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు సీడీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కిషన్‌రావు, శివస్వామి, బెనర్జి, శ్రీ్ధర్, శేఖర్ చంద్ర, రామకృష్ణగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ- ఎ.పిలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతిలో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుతున్న తొలి చిత్రం ఇది. గ్యాంగస్టర్ నరుూం కేసు ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. అలాంటి కథ తీసుకొని రాంబాబు సినిమా చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. సినిమా ఘనవిజయం సాధించాలన్నారు. సుమన్ మాట్లాడుతూ- భరత్ మంచి టెక్నీషియన్. వాస్తవ సంఘటనలను అద్భుతంగా తెరకెక్కించాడు. కథలో కొత్తదనముంటే ఎలాంటి సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు అన్నారు. కట్టా రాంబాబు మాట్లాడుతూ- పద్మాలయ స్టూడియోలో టెక్నీషియన్‌గా నా సినిమా కెరీర్ ప్రారంభమైంది. ఆ తరువాత కొనే్నళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాను. రియల్టర్‌గా, పొలిటీషియన్‌గా అంచలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాను. నరుూం కథతో సినిమా చేస్తే బాగుంటుందని ప్లాన్ చేశాను. ప్రజలకు తెలియని ఎన్నో విషయాలు ఈ సినిమా చూపిస్తున్నాను. శేఖర్ చంద్ర మంచి సంగీతం అందించాడన్నారు. దర్శకుడు భరత్ మాట్లాడుతూ సెప్టెంబర్ 18న అమరావతిలో చిత్రాన్ని ప్రారంభించామని, నిర్మాత కట్టా శారద ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మించారన్నారు. తన కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుందన్నారు.