బిగ్ డీల్ కుదిరిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలితో నేషనల్ వైడ్ స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్. ప్రస్తుతం ఆయనకు వచ్చిన గుర్తింపు మరే సౌత్ హీరోకి దక్కలేదు. ప్రభాస్‌తో అటు హిందీలో కూడా సినిమాలు నిర్మించేందుకు పలువురు బాలీవుడ్ దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. బాహుబలి హిందీలో ఘన విజయం సాధించడంలో దర్శక,నిర్మాత కరణ్ జోహార్ పాత్ర కీలకమైనదే. ఈ నేపథ్యంలో ఆయన ప్రభాస్‌తో బిగ్ డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆయనతో వరుసగా మూడు సినిమాలు చేసేందుకు డీల్ కుదిరిందట. దీనికి ప్రభాస్ కూడా ఓకె చెప్పినట్టు తెలుస్తోంది. ఈ డీల్‌కుగాను ప్రభాస్‌కు 150 కోట్ల ఆఫర్‌ను ఇచ్చినట్టు బి టౌన్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ మూడు చిత్రాలు ఉంటాయని, త్వరలోనే మంచి కథతో కరణ్ ప్రభాస్‌ని కలుస్తాడని తెలిసింది. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రాన్ని హిందీలో విడుదల చేయడానికి కరణ్ ఒప్పందం కుదుర్చుకున్నాడట. మొత్తానికి బాహుబలి దెబ్బకు ప్రభాస్ బాలీవుడ్ హీరోగా సెటిల్ అవ్వడంలో ఎలాంటి సందేహం లేదు.