అదిలాబాద్

ఖానాపూర్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపూర్, జూన్ 22: నిర్మల్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ గురువారం ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఆయన ఖానాపూర్ పోలీస్ సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్సైలు వినయ్‌కుమార్, సంజీవ్, బాలకృష్ణ, రాజు, సిఐ నరేష్‌కుమార్‌లతో పాటు డిఎస్పీ మనోహర్‌రెడ్డితో సమావేశమయ్యారు. అయితే పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన పలు రికార్డులను ఎస్పీ పరిశీలించారు. ఈనెల 26న రంజాన్ పండుగ సందర్భంగా శాంతిభద్రతలను పటిష్టంగా ఉంచాలన్నారు. అవసరమైన బందోబస్తును వినియోగించుకోవాలన్నారు. ఖానాపూర్ సిఐ నరేష్‌కుమార్ ఇటీవలే బదిలీ అయ్యారు. వరంగల్ జిల్లా నుండి వచ్చిన ఖానాపూర్ సిఐ ఆజ్మీర పెద్దన్నకుమార్ ఎస్పీని కలుసుకున్నారు.