వరంగల్

జిఎం కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాల్‌పల్లిరూరల్, జూన్ 22: సింగరేణిలో వారసత్వ ఉద్యోగల కోసం చేపట్టిన కార్మికులకు మద్దతుగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం భూపాల్‌పల్లి ఏరియా సింగరేణి జిఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్, బిఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని యూనియన్లను కలుపుకుని పారిశ్రామిక విధానాల చట్ట 1947-12/3 ప్రకారం డిపెండెంట్ ఉద్యోగాల ఇవ్వాలన్నారు. కార్మికుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించి, నిరవధిక సమ్మె విరమింపచేయించాలని కలెక్టర్ మురళికి వినతికి ఇచ్చిన వినతి పత్రంలో ప్రజాసంఘాల జాయింట్ ఆక్షన్ కమిటి కోరింది. కార్యక్రమాల్లో ఏఐటియూసి, సిఐటియు, హెచ్‌ఎంఎస్, బిఎంఎస్, ప్రజాసంఘాలు ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, కేవీపీఎస్, సీఐటీయూ, యూటీఎఫ్, ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల నాయకులు మోటపలకుల రమేష్, గాదే పుల్లయ్య, బందు సాయిలు, వంగల రామస్వామి, వెంకయ్యనాయుడు, రాజ్‌కుమార్, సుగుణ, సుజేందర్, ధనరాజ్, సాంబయ్య, విజయ్, కిరణ్, ప్రవీణ్, రాజేందర్, దేవేందర్, తిరుపతి, స్వరూప, చిట్టిబాబు, వెంకట్‌రెడ్డిలు పాల్గొన్నారు.