విజయవాడ

జక్కంపూడి టౌన్‌షిప్‌లో 10వేల గృహాల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 22: విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలో ఎకనామిక్ సిటీ డెవలప్‌మెంట్ టౌన్‌షిప్‌లో పదివేల గృహాలను నిర్మించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీకాంతం పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం సమావేశ మందిరంలో పట్టణ వౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టిడ్‌కో) ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె.నివాస్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే ఎకనామిక్ సిటీ నిర్మాణానికి 265 ఎకరాలను ఇవ్వటం జరిగిందని, ఈ భూములను టిడ్‌కోకు బదలాయించే విధంగా నిర్ణయం తీసుకున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గందం చంద్రుడు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె.నివాస్, విజయవాడ ఆర్‌డివో ఎస్.హరీష్, టిడ్‌కో వైస్ చైర్మన్ రామనాథం, స్టేట్ టెక్నికల్ అడ్వైజర్ కె.విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.