తూర్పుగోదావరి

మాజీ ఎమ్మెల్యే బొజ్జికి అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విఆర్ పురం, జూన్ 22: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి అస్వస్థతకు గురై భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం మాజీ ఎమ్మెల్యే బొజ్జి బుధవారం మండల పరిధిలోని అడవివెంకన్నగూడెం గ్రామం వద్ద తన నివాసంలో బాత్‌రూమ్‌లో జారి పడిపోయారు. దీంతో అస్వస్థతకు గురైన బొజ్జిని హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారన్నారు. గురువారం నాటికి ఆయన పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. శుక్రవారం మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ తరలించి చికిత్సను అందించనున్నారని పేర్కొన్నారు. సిపిఎం సీనియర్ నాయకుడైన బొజ్జి అస్వస్థతకు లోనైన విషయం తెలుసుకున్న తెలుగు రాష్ట్రాల సిపిఎం నాయకులు, ఇతర పార్టీల నాయకులు సైతం ఆయనను పరామర్శించారు. విశాఖపట్నంలో జరుగుతున్న జాతీయ గిరిజన సదస్సులో ఉన్న మాజీ ఎంపి మిడియం బాబూరావు, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మాజీ ఎంపి బృందాకారత్ తదితరులు ఆయన పరిస్థితిని ఫోను ద్వారా అడిగి తెలుసుకొని ఆయనను పరామర్శించారు.