శ్రీకాకుళం

ఏమిటీ పనులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోని హిందూ ఆలయాల్లోకెల్లా ఆరోగ్యప్రదాత శ్రీ సూర్యనారాయణస్వామి అరసవల్లి గుడి గొప్పది. కాబట్టి దేవుడి పేరిట వ్యాపారాల్లో కెల్లా గొప్ప వ్యాపారం కూడా ఇక్కడే జరుగుతుంటుంది. దర్శనం మొదలుకుని ప్రసాదం దాకా, షేవ్ నుంచి సేవ వరకూ... ప్రతిదీ బిగ్ బిజినెస్‌గా మారిన పుణ్యస్థలిలో ఇప్పుడు అపచారాలు కొత్తగా మొదలైంది. నిజానికి పెద్ద అపచారమేదో జరిగిపోతున్నదని ఇప్పుడు గుండెలు బాదుకోవడం దండగ. ఎందుకంటే అపచారాలు జరగటం అరసవల్లి ఆలయాలనికి కొత్తకాదు. చాలా మామూలు. దేవుడికి భక్తిశ్రద్ధలతో తలనీలాలు అర్పించిన భక్తుల జుత్తును దొంగతనం చేసి లక్షల రూపాయలు దోచుకున్న సిబ్బంది ఇంకా ఆ ఆలయంలోనే పనిచేసుకుంటున్నాడు. ఆదిత్యుని జయంత్యుత్సవం (రథసప్తమి) వేడుకను కనురాలా చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు సొంత ముద్రణ చేసిన క్షీరాభిషేకం టిక్కెట్లు దొడ్డిదారిలో అమ్మేసే ఘనులు ఇక్కడే ఉన్నారు. టెంకాయ టెండర్లకు తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చే వారికి పంగనామాలు పెట్టి కొబ్బరి చిప్పలన్నీ సిక్కోల్ హోటళ్ళకు అమ్మేసే షావుకారులు సిబ్బందిలోనే ఉన్నారు. ఇంద్రపుష్కరిణీ గట్టుపై చెట్టుపుట్టల మధ్య రాసలీలలు చేసుకునేందుకు గంటకు రెంటు పేరిట అవకాశం ఇచ్చే దేవాదాయశాఖ సిబ్బంది కూడా ఇంకా ఆలయంలోనే పనిచేస్తున్నారు. భక్తుల కోసం సరికొత్తగా నిర్మించిన గదుల్లో విలాసాలు, వికృత చేష్టలు, చివరకు మద్యం సేవించే బారుల్లా మార్చేసే అతి అత్యంత ఆప్తులైన ఉద్యోగులు సైతం అరసవల్లి దేవుడు కొలువులోనే ఉన్నారు. సరికొత్తగా ఆలయానికి చెందిన భూమి 80 అడుగుల రోడ్డులో ఉండగా,
దానిని ప్రైవేటు స్కూల్ బస్సుల స్టాండ్‌గా రూ. 5000 అద్దెకు ఇచ్చే మహాఘనులు సైతం ఆదిత్యుని సన్నిధిలోనే పనిచేస్తున్నారు. వీరంతా ఎప్పటి నుంచో అపచారాలు చేస్తున్నా... ఆరోగ్యప్రదాతకు ఆగ్రహం ఇంకా కలగలేదు. అందుకేనేమో - సరికొత్తగా పుష్కరిణిని అపవిత్రత చేసేసారు. అందులో బ్రతికే మత్స్యసంపదను మూడురోజుల క్రితం మృత్యువాతపట్టేలా చెత్తాచెదారాన్ని పోసారు. భక్తులు స్నానం చేసి, సూర్యనమస్కారాలు చేసే పుష్కరిణినీ చుట్టూ గల పారిశుద్ధ్యం వల్ల భక్తులు ఆ ప్రాంతంలో స్నానం చేసేందుకు వెళ్ళలేక బయట నుంచే సూర్యభగవానుడికి ఒక నమస్కారం పెట్టేసి ఊసురుమంటూ వెనుతిరుగుతున్నారు. ఇదంతా ఆలయ అధికారులకు తెలిసినా వాటిపై చర్యలు తీసుకునేందుకు వారికి స్థానిక బలం లేదంటూ వాపోవడం గమనార్హం.
ఇంద్రుడు ప్రతిష్టించిన పుష్కరిణి కావడంతో ఇంద్రపుష్కరిణిగా పిలువబడే అరసవల్లి గుడిలో గల ఇంద్రపుష్కరిణి చూస్తే ఏదో మురికి కూపంలా ఉండడంతో అక్కడకు వచ్చిన భక్తులు ఏమిటీ ఈ దుస్థితి అంటూ విస్తుపోతున్నారు. ఇంద్రపుష్కరిణీలో ఎటువంటి చెత్తనైనా తినివేసేలా మత్స్యసంపదను పెంచుతున్నా అవి చనిపోయి పైకి తేలడంతో ఆ పరిసర ప్రాంతాలు దుర్గందంతో నిండిపోయింది. కలియుగ ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడిని దర్శించుకునే ముందు ఇంద్రపుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోవడం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఆచారం. చనిపోయిన చాపలతో దుర్గంధభరితంగా ఉండడంతో పలువురు భక్తులు గత కొన్ని రోజులుగా ఇంద్రపుష్కరిణీలో స్నానం ఆచరించేందుకు ఇష్టపడడం లేదు. ఇంద్రుడు ప్రతిష్టించిన ఇటువంటి పుష్కరిణిని అటు దేవాదాయశాఖ అధికారులు, అర్చకులు పట్టించుకోకపోవడంతో భక్తులు మండిపతున్నారు. గత మూడు రోజులుగా చాలా చేపలు చనిపోవడంతో పుష్కరిణిలో అపచారం జరిగిందంటూ ప్రచారం ప్రారంభమైంది. ఇటీవల ఆలయ అభివృద్ధిని పరిశీలించేందుకు దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి వచ్చిన నేపథ్యంలో అర్చకులు, దేవాదాయశాఖ సిబ్బంది మధ్య గల అగాథం ఆగిపోవాలని, భక్తులకు ఆధ్యాత్మకమైన బలాన్ని కల్పించేలా ఇక్కడ అందరూ కలిసి వ్యవహారించాలని గట్టిగా ఆదేశించిన విషయం తెలిసిందే. కాని, కాసుల దాసులుగా మారిన దేవదాయశాఖ సిబ్బంది ఆయన ఆదేశాలను భేఖాతరు చేసారన్నది సుస్పష్టంగా ఈ పుష్కరిణీ పరిశుభ్రత అంశమే రుజువుచేస్తుది. స్థానిక ఎమ్మెల్యే స్వగృహం, స్వంత ఊరు అయిన అరసవల్లిలో ఇటువంటి పరిస్థితులు ఆలయం ప్రాంగణంలో చోటుచేసుకోవడం దురదృష్టకరమని ఆమె భావించి, దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో తక్షణమే ప్రత్యేక సమీక్షాసమావేశం ఏర్పాటు చేసి జరిగిన అపచారాలను పూర్తిగా తెలుసుకుని తగిన చర్యలు తీసుకునేందుకు ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి సంసిద్ధం అవుతున్నారు. ఆలయ సాంప్రదాయాలను కాలరాసే వారిపై కఠిన చర్యలకు వెనుకాడబోనంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే ఏ కార్యక్రమం అయినా అరసవల్లిలో జరగడానికి వీల్లేదంటూ ఆమె ఇప్పటికే ఆలయం సిబ్బందిని ఆదేశించారు. ఏదిఏమైనప్పటికీ, దేవాదాయశాఖ సిబ్బంది, అర్చకుల మధ్య ఏర్పడిన తుపాను టీ కప్పులోనే అనుకుంటున్నా...అది సునామీగా మారేలా కన్పిస్తోంది.