శ్రీకాకుళం

శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం (రూరల్) ,జూన్ 23: బిజెపి నగర పార్టీ కార్యాలయంలో శుక్రవారం భారతీయ జన్‌సంఘ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్‌ముఖర్జీ 64వ వర్థంతి సందర్భంగా ఆయనకు బిజెపి నగర నాయకులు నివాళులర్పించారు. 1901 జూలై 6న కలకత్తాలో జన్మించిన ముఖర్జీ 1953 జూన్ 23న మరణించారన్నారు. ఇంగ్లండ్ నుండి బారిష్టర్ పట్టా పొంది 33 సంవత్సరాల పిన్నవయస్సులోనే కలకత్తా విశ్వవిద్యాలయానికి కులపతిగా పనిచేశారు. తదుపరి హిందూమహాసభకు అధ్యక్షునిగా, నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంతో పరిశ్రమల శాఖామంత్రిగా పనిచేశారు. నెహ్రూ అప్పటి పాకిస్థాన్ ప్రధాని లియాఖత్ ఆలీఖాన్‌తో జరిపిన ఢిల్లీ ఒప్పందానికి వ్యతిరేకంగా కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి 1951లో భారతీయ జన్‌సంఘ పార్టీ స్థాపించారు. నాటి భారతీయ జనసంఘ్ పార్టీయే నేటి బిజెపి పార్టీకి మూలం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం, నగర అధ్యక్షులు చల్లా వెంకటేశ్వరరావు, అట్టాడ రవిబాబ్జీ, రెడ్డ్భిగ్యలక్ష్మీ, దుప్పల రవీంద్రబాబు, కునిగిరి నీలకంఠ, సంపతిరావు నాగేశ్వరరావు, సంపతిరావు రమణమూర్తి, దయాసాగర్, సంపత్; రాహుల్ తదితరులు పాల్గొన్నారు.