తూర్పుగోదావరి

అంతర్వేదికరలో గ్యాస్ లీకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలికిపురం, జూన్ 23: మోరి స్ట్రక్చర్ పరిధిలోని అంతర్వేదికర నెంబర్ 20 ఒఎన్‌జిసి బావి నుండి శుక్రవారం ఉదయం స్వల్ప లీకేజీ సంభవించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. గత మూడు నెలల్లో కేశవదాసుపాలెం నుండి అంతర్వేదికర వరకు సుమారు ఎనిమిదిసార్లు గ్యాస్ లీకవడంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అంతర్వేది నెంబర్ 20 బావి నుండి మోరి గ్యాస్ కనెక్టింగ్ స్టేషన్‌కు అనుసంధానమయ్యే ఈ పైపు నుండి సంభవించిన స్వల్ప లీకేజీని గుర్తించిన ఒఎన్‌జిసి అధికారులు తక్షణమే రంగంలోకి దిగి లీకేజిని నివారించారు. పలు పర్యాయాలు లీకేజీలు జరుగుతున్నందున శాశ్వత ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.