విజయవాడ

మానవ అక్రమ రవాణా నిరోధంలో భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 23: మానవ అక్రమ రవాణా నిరోధంలో ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు, ప్రజలు, స్వచ్చంద సంస్ధలు భాగస్వాములు కావాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సుమితాదావ్రా పేర్కొన్నారు. మహిళ అభివృద్ధి, స్ర్తి శిశు సంక్షేమ శాఖ, రవాణా, రోడ్డు, భవనాల శాఖ, హెల్ప్ సంస్థ సంయుక్తంగా విజయవాడలో శుక్రవారం నిర్వహించిన లైంగిక దోపిడీకై బాలికల అక్రమ రవాణా నిరోధంపై వర్క్‌షాపు జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన సుమితా దావ్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలు, స్వచ్చంద సంస్థలు, విద్యాసంస్థలు సమష్టిగా కృషి చేస్తేనే బాలికల అక్రమ రవాణా నిరోధం సాధ్యపడుతుందన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా హెల్ప్, మహిళా శిశు సంక్షేమ శాఖ చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అపర్ణ ఉపాధ్యాయులు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు, బాలికల అక్రమ రవాణా తీవ్ర స్థాయిలో ఉందని, ప్రభుత్వ శాఖలు, స్వచ్చంద సంస్ధల సమన్వయంతో ఈ మానవ అక్రమ రవాణా నిరోధించవచ్చన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మాలకొండయ్య మాట్లాడుతూ బాలికలు తమను తాము రక్షించుకోవాలంటే తప్పనిసరిగా విద్య అందించాలన్నారు. యూనిసెఫ్ ప్రతినిధి మురళీకృష్ణ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాలో రాష్ట్రంలోని వివిధ రవాణా వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. బస్టేషన్లు, రైల్వేస్టేషన్లులో పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ట్రాఫికింగ్‌ను గుర్తించడమే కాక బాధితులను రక్షించే అవకాశముందన్నారు. ఈ కార్యక్రమంలో యుఎన్ మహిళా విభాగం రాష్ట్ర ప్రాజెక్టు అధికారి భవాని, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్ అరుణ్‌కుమార్, టెర్రిడెస్ హోమ్స్ నెధర్లాండ్స్ ప్రతినిధి ఎజికెల్ కానవల్లి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, జిఆర్‌పి, ఆర్‌పిఎఫ్, సిఐడి, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.