అదిలాబాద్

హరితహారంపై అనుమానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాంకిడి, జూన్ 25: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల పెంపకం వాంకిడి మండలంలో ఈసారైన లక్ష్యం దిశగా ముందుకు సాగుతుందా? లేదా ? అని మండల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2010 నుండి మండలంలో ప్రతి సంవత్సరం దాదాపు 5లక్షల మొక్కలు పెంచడానికి ఐదారు నర్సరీలు నిర్వహించి వాటికోసం దాదాపు 15-16లక్షల ప్రభుత్వం సొమ్మును ఖర్చుపెట్టి మరీ మొక్కలు నాటుతున్నారు. అయినా ఇప్పటి వరకు ఒక్క మొక్క కూడా బతికింది లేదు. 2010 నుండి ఇప్పటి వరకు ఏటా దాదాపు 20లక్షల చొప్పున ఇప్పటివరకు దాదాపుకోటి 40 లక్షల రూపాయలు సర్కార్ సొమ్ము ఖర్చు అయినా నేటికి మొక్కల పెంపకం అపహాస్యంగా మారిందే తప్ప లక్ష్యం నెరవేరలేదని కనీసం ఈ సంవత్సరమైన ఈలక్ష్యం నెరవేరుతుందా అని మండల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం మండలంలో వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో మండల అధికారులు నర్సరీలను పరిశీలించి రైతులను, ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. ఎంత ఖర్చు అయినా సరే మొక్కల పెంపకం జరగాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఒకవైపుఅన్ని జిల్లా కలెక్టర్ల నుండి కింది స్దాయి అధికారుల వరకు, మరోవైపు అటవీశాఖ అధికారులను ఆదేశిస్తుంది.అయినా ఆ మంత్రం ఇప్పటివరకు మండలాల్లో పనిచేసే అధికారులపై పారనట్లు, పనిచేయనట్లు కనబడుతుంది. మండలంలో ఏర్పాటుచేసిన ఏ సర్సరీ కూడా ఇప్పటికీ మొక్కలు నాటే మొదటి స్టేజీ వరకు కూడా రాకపోవడంతో మండలంలో ఈసారైన మొక్కల పెంపకం నిజంగానే సక్రమంగా జరుగుతుందా అనే అనుమానం మండల ప్రజల్లో నెలకొంది. ప్రతి సంవత్సరం ఇలాగే లక్షల రూపాయలు సర్కార్ సొమ్ముతో నర్సరీలను పెంచుతూ చివరికి మొక్కలు పెరగకా అవి నాటడానికి పనికి రాకపోవడంతో వాటిని నాటకుండానే వదలివేస్తున్నారని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుందేమోనని జనం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 2010 సంవత్సరం నుండి విఫలం అవుతున్న మొక్కల పెంపకం ఈసారి కూడా అలాగే అవుతుందనడానికి కొన్ని కారణాలు మాకు కనబడుతున్నాయని, ఇక్కడ పనిచేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులే దీనికి కారణమని వారంటున్నారు. సక్రమమైన ప్రణాళిక లేకవోవడంతోపాటు మొక్కలు నాటిన తర్వాత వాటి గురించి పట్టించుకోకపోవడమేనని వారంటున్నారు. హరితహారం పథకంలో మంజూరవుతున్న నిధులను సక్రమంగా ఖర్చుపెట్టకుండా అధికారులు ఇష్టమొచ్చినట్లు ఖర్చుచేయడంతో లక్ష్యం చేరుకోవడంలో అధికారులు విఫలం అవుతున్నారనే అవవాదు లేకపోలేదు. గతంలో మండలంలో అటవిశాఖ తరపునే కాకుండా, ఇజిఎస్, ఉద్యానవనశాఖ, వ్యవసాయశాఖతోపాటు ఐటిడిఎ సంస్థ నుండి సైతం మొక్కల పెంపకం కోసం ప్రయత్నం జరిగింది అయినా ఫలితం లేకపోయింది. ఈ సంవత్సరం కూడా మండలంలో దాదాపు ఐదు లక్షల మొక్కలు పెంచడానికి ప్రణాళికలను సిద్దం చేసినా, మండల అధికారులు లక్ష్యం చేరుతారనే నమ్మకాన్ని మండల ప్రజలకు కల్పించలేకపోతున్నారని పలువురు అంటున్నారు. ఏదేమైనా మండలంలో హరితహారం సక్సెస్ కావాలని మండల ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారని,మండల రైతులు అంటున్నారు. మండలంలో వర్షాలు కూడా బాగానే పడుతుండడంతో ఈ ఏడాది హరితహారం కార్యక్రమం విజయవంతం కావాలంటే అందరి భాగసామ్యాన్ని తీసుకోవలసి ఉందని మండల ప్రజలంటున్నారు.
ఇజిఎస్ ఎపఒ మల్లయ్య వివరణ
ఈ విషయంలో ఉపాధి హామీ ఎపివో మల్లయ్యను వివరణ కోరగా మండలంలో ఈసారి హరితహారం కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మండలంలోని కోమటిగూడ, బెండార, జైత్‌పూర్ గ్రామాలల్లో మూడు లక్షల మొక్కలను ఇజిఎస్ ఆధ్వర్యంలో పెంచుతున్నట్లు, అదేవిధంగా వాంకిడిలోని ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద ఒక నర్సరీ, వాంకిడిలోని గాయత్రి జిన్నింగ్ మిల్ పక్కన మరో నర్సరీలను ఫారెస్టు శాఖ ఆద్వర్యంలో 2 లక్షల మొక్కలను పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. వాటి నిర్వహణకు దాదాపు 15,16 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.