శ్రీకాకుళం

ఘనంగా జగన్నాథుని రథయాత్ర ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జూన్ 25: నగరంలో వివిధ ప్రాంతాల్లో జగన్నాథస్వామి దేవాలయాల్లో రథయాత్రలు ప్రారంభమయ్యాయి. ఆదివారం సాయంత్రం చిన్నవర్షం పడుతున్నప్పటికీ రథయాత్ర కొనసాగించారు. నగరంలోని గుజరాతిపేటలో ఆంధ్రాసంప్రదాయంలో, బొందిలీపురం, ఇలిసీపురంలలో పూరీ సంప్రదాయాలలలో ప్రారంభమయ్యాయి. సాయంత్రం బొందిలీపురం నుండి రథయాత్ర ప్రారంభమైంది. బొందిలీపురంలో బయలుదేరి ఇలిసిపురం వరకు సాగి అక్కడ గుండిచా ఆలయంలో విగ్రహాలు పెట్టి పూజలు నిర్వహించారు. గుజరాతీపేటలో ఇంద్రద్యుమ్యం వద్ద విగ్రహాలు పెట్టి 11 రోజుల్లో రోజుకో అవతారంలో స్వామివారి దర్శనమిస్తారు. ఆదివారం బలభద్ర, జగన్నాధస్వామి ఉత్సవ మూర్తులను రథంలో ఊరేగించి యాత్రోత్సవం జరిపారు. ఈ రథయాత్రలో పరిసర ప్రాంతాలనుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అరసవల్లి ఆదిత్య ఆలయం, పాలకొండ రోడ్డులో శ్రీ కోదండరామాలయంలో జగన్నాథుని రథయాత్రలు నిర్వహించారు.