శ్రీకాకుళం

రైలు కింద పడి తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొందూరు, జూన్ 25: సంతకవిటి మండలం వాకలవలస గ్రామానికి చెందిన యంపటాపు భాగ్యలత, ఆమె కుమార్తె పావని కుటుంబ కలహాల నేపథ్యంలో జీవితంపై విరక్తి కలిగి ఆదివారం పొందూరు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో పావని(15) అక్కడికక్కడే మృతి చెందగా, తల్లి భాగ్యలత తీవ్రంగా గాయపడి, శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమదాలవలస రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. పావని మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.
ఆస్తి తగాదాలే కారణమా?
సంతకవిటి: కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆస్తి తగాదాలు, ఐదేళ్లుగా భర్తకు తల్లి, కూతుళ్లు దూరంగా ఉండడం వంటి కారణాలే ఈ సంఘటనకు పురిగొల్పాయా అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మండలంలోని గోళ్లవలస గ్రామానికి చెందిన వెంపటాపు భాగ్యలత అనే మహిళ తన చిన్నకుమార్తె పావని(15)తో కలిసి మండలానికి శివారు ప్రాంతంలో ఉన్న పొందూరు రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటనలో ట్రైన్ ఢీకొన్ని పావని అక్కడికక్కడే మృతి చెందగా, తల్లి భాగ్యలత దూరంగా తుళ్లిపోయింది. భాగ్యలత భర్త కామినాయుడు కుటుంబ బాధ్యతలకు ఐదేళ్లుగా దూరంగా ఉండడం, ఆర్థిక ఇబ్బందులు కారణంగా పిల్లలను చదివించడం కష్టతరం కావడం, అంతేకాకుండా చిన్నపాటి రైతు అయిన వీరు సొంత ఇంటికి వచ్చి తగాదా పడుతుండడంతో భార్య మనస్తాపానికి గురైనట్టు గ్రామంలో చర్చించుకుంటున్నారు. పెద్దకుమార్తె అయిన గాయత్రీ బూర్జ మండలం ఓవీపేట మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ చదువుతోంది. మృతురాలు చిన్నకుమార్తె కూడా ఇంటర్ చదవడం కోసం అదే మోడల్ స్కూల్‌కు దరఖాస్తు చేసింది. ఈ సంఘటనలో ఆ గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.