శ్రీకాకుళం

రక్త దానంలో జిల్లా ప్రథమంగా నిలవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 25: రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్తం సేకరించడంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే శ్రీకాకుళం జిల్లా ప్రధమస్థానంలో నిలవాలని జెసి కె వి ఎన్ చక్రధరబాబు అన్నారు. జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ వద్ద ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జెసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకులో రక్తం యూనిట్ల కొరత ఉన్న సమయంలో బంటుపల్లి మహాలక్ష్మీ యూత్‌క్లబ్ యువకులు రక్తం దానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయన్నారు. రోడ్డు ప్రమాదాల వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి , రక్త హీనతతో బాద పడేవారికి ప్రసవ సమయంలో స్ర్తిలకు రక్తం చాలా అవసరమని, రక్తదానం చేసేవారు ప్రాణాదాతలు అవుతారన్నారు. యువకులు, విద్యార్థులు ప్రతీ మూడునెలలకొకసారి రక్తం దానం చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. వారిలో కొత్తరక్తకణాలు పెరగడం వలన శరీర ధృడత్వం ఏర్పడుతుందని తెలిపారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువకులకు వివిధ రకాల పండ్లు, పండ్ల రసాలను అందజేశారు. జిల్లాలో యూత్‌క్లబ్‌లు అన్నీ ముందుకు వచ్చి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ బంటుపల్లి మహాలక్ష్మీ యూత్‌క్లబ్ అధ్యక్షులు నడుకుదిటి ఈశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 50మంది యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసినట్లు తెలిపారు. బ్లడ్‌బ్యాంకులో రక్తం నిల్వలేని సమయంలో వీరంతా ముందుకు రావడం ఎంతో అభినందనీయమన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని యువత రక్తదాన శిబిరాల్లో పాల్గొనాలన్నారు. ఈకార్యక్రమంలో రెడ్‌క్రాస్ మెంబర్లు నటుకుల హరిసత్యన్నారాయణ, బలివాడ మల్లేశ్వరరావు, నిక్కు అప్పన్న, యూత్‌క్లబ్ అధ్యక్షుడు నడుకుదిటి ఈశ్వరరావు, వలంటీర్ చైతన్యకుమార్, యువకులు, రెడ్‌క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.