అదిలాబాద్

బాసరలో భక్తుల రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, జూన్ 26: ప్రసిద్ద పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరుస సెలవు దినాలను పురస్కరించుకుని అమ్మవారి ఆశీర్వచనాలను అందుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రైవేటు వాహనాలు ఆర్టీసి బస్సుల్లో భక్తుల రాకతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు తమ చిన్నారులకు ఆలయంలోని అక్షరాభ్యాస మండపాల్లో అక్షరాభ్యాస పూజలను జరిపించారు. ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రామసుబ్రహ్మణ్యం సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకుని పూజలుచేశారు. వీరిని ఆలయ అధికారులు, అర్చకులు మంగళవాయిద్యాలు, పూర్ణకుంభస్వాగతం పలికారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రామసుబ్రహ్మణ్యం దంపతులచే ఆలయ అర్చకులు ప్రత్యేక కుంకుమార్చన పూజలు జరిపించి హారతినిచ్చి ఆశీర్వదించారు. ఆలయ స్థానాచార్యుడు ప్రవీన్‌పాఠక్, ఆలయ ప్రత్యేకాధికారి ఎ.సుధాకర్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి దంపతులను పట్టు వస్త్రాలతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ ఇలంబరిది అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఇలంబరిదిని ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వీరివెంట ముధోల్ సిఐ రఘుపతి, బాసర ఎస్సై మహేష్, తదితరులు పాల్గొన్నారు.