అదిలాబాద్

అక్రమ వ్యాపారానికి చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, జూన్ 26: జిల్లాలో జిరో దందా యధేచ్ఛగా సాగుతుండటంతో జిఎస్‌టి అమలులోకి వస్తే అక్రమ వ్యాపారానికి చెక్కుపడుతుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమ వ్యాపారంలోకి జూలై 1నుంచి జిఎస్‌టి అమలులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం, వాణిజ్య పన్నుల శాఖలు నిమగ్నమైపోయ్యారు. జిల్లాలో ని వ్యాపారులు అంతరాష్ట్ర జిల్లా సరిహద్దులను దాటిస్తు సరుకులను తీసుకొస్తు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే వ్యాపారులకు కళ్లెం వేసేందుకు జిఎస్‌టి వస్తుంది. వ్యాట్ (వాల్యూ యాడెడ్ ట్యాక్స్) టర్నోవర్ ట్యాక్స్ (టిఓటి) పన్నులు చెల్లించే వ్యాపారులు జిఎస్‌టి పరిధిలోకి మారేందుకు కేంద్రం గడువు విధించింది. ఇప్పటివరకు జిల్లాలో 4465మంది వ్యాపారులు ఉండగా 90శాతంమేర వ్యాపారులంతా జిఎస్‌టిలోకి మారారు. మరి కొంతమంది జిఎస్‌టి పరిధిలోకి మారకపోవడంతో వాణిజ్యశాఖ అధికారులు వాటిని జిఎస్‌టిలోకి మార్చేందుకు నిమగ్నమయ్యారు. వ్యాపారులు ఇక నుంచి పన్ను చెల్లింపు పరిధి నుంచి తప్పించుకోలేరు. జిఎస్‌టి పరిధిలోకి మారకుండా వ్యాపారం చేసినట్లయితే జిఎస్‌టి అమలులోకి వచ్చిన తరువాత సరుకులు పట్టుబడితే ఏడు రేట్లు అపరాద రుసుం, క్రిమిన ల్ కేసులు తప్పవంటున్నారు.
ఏడాదికి సుమారు 20 లక్షలు టర్నోవర్ దాటిన వ్యాపారులు జిఎస్‌టి పరిధిలోకి వస్తారని, ఇందులోకివచ్చిన వారు ఆదాయ పన్నుకు ఇచ్చే కార్డునెంబర్ ఆధారంగా సభ్యత్వ సంఖ్య ఉంటుంది. పాన్‌కార్డు నెంబర్‌కొట్టగానే సదరు వ్యాపారులు వాణిజ్య ఆదాయం పన్నువివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో పన్ను ఎగవేతకు వేటు పడుతుందంటున్నారు. గతంలో అనేక మంది వ్యాపారులు అంకెలగారడితో లెక్కలు చూపి పెద్ద మొత్తంలో పన్నులు ఎగవేసిన వారంతా ఇక జిఎస్‌టి విధానంతో పూర్తి స్థాయిలో ఆధాయ పన్ను చెల్లించడంతో ప్రభుత్వానికి వేల కోట్ల ఖజానా జమ అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మంచిర్యాల జిల్లాకు దేశంలోని అన్నిరాష్ట్రాలను కలుపుతూ పోయ్యే రైలు మార్గంకూడా ఉండటంతో ఎలాంటి బిల్లులు లేకుండా సరుకులను జిల్లాకు తీసుకొచ్చి తమ వ్యాపారం పది లక్షలలోపే ఉంటుందని జీరో వ్యాపారం చేస్తు ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. మరికొందరూ బడా వ్యాపారులు సైతం జీరోదందా నడుపుతుండగా ప్రస్తుతం జిఎస్‌టి అమలుపరిస్తే వ్యాపారులు ఎక్కడ వ్యాపారం చేసిన తప్పనిసరిగా జిఎస్‌టి ద్వారా కేటాయించిన నెంబర్‌ను నమోదు చేయాల్సిందే. ఒక వ్యక్తి తన షాపు పేరుపై రిజిస్ట్రేషన్ అయి రకరకాల వ్యాపారాలు చేసిన ఖచ్చితంగా జిఎస్‌టి నెంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. దీనితో ఒక వ్యక్తి ఎన్ని వ్యాపారాలు చేసిన వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వానికి వెంటనే చేరిపోతాయి. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్న సరుకులకు చెక్కు పెట్టేందుకే జిఎస్‌టి అమలవుతుందన్నారు.