వరంగల్

ఈదుల్ ఫితర్ ముబారక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట, జూన్ 26: రంజాన్ పండుగను పురస్కరించుకుని నగరంలోని ఈద్గాలు అన్ని కళకళలాడాయి. సోమవారం రంజాన్ సందర్భంగా త్రినగరిలోని మసీద్‌లలో ముస్లిం సోదరులంతా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆనందోత్సాహాలతో పరస్పరం అలయ్ బలయ్ చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దేశంలోని ప్రజలు మత సామరస్యానికి, సౌభాతృత్వానికి ప్రతీకగా రంజాన్ జరుపుకుంటారు. ఖిలావరంగల్‌లో మజీద్‌లో జరిగిన ప్రార్థనలలో నగర మేయర్ నన్నపనేని నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ముందుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి అంతా సుఖ శాంతులతో జీవించాలనే సందేశాన్ని ఇచ్చేదే రంజాన్ మాసం అని, ఈ మాసాన్ని స్ఫూర్తిగా తీసుకుని జీవనం గడపాలని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం మానవాళికి మంచి ప్రవర్తనలు నేర్పేదని వివరించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక వెనుకబడిన ముస్లింలందరికీ ప్రభుత్వం చేయూతను ఇస్తుందని తెలిపారు. భవిష్యత్తులో వారి అభివృద్ధి కోసం 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వ+డానికి సిద్ధపడిందని వివరించారు. నగరంలోని ఈద్గాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లపుడూ ఉంటాయని పేర్కొన్నారు. హన్మకొండ బొక్కలగడ్డ మజీద్‌లో జరిగిన ప్రార్థనలలో పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్ ఎంపి దయాకర్ పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ సందర్బంగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం అంటేనే దాన ధర్మాలకు ప్రతీక అని, ఈ మాసంలో అందరూ తమకు తోచిన విధంగా పేదలకు దానధర్మాలు చేస్తారని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఒక వంతు దాన ధర్మాలు చేస్తే 80 వంతుల పుణ్యం వస్తుందని భావించి దానధర్మాలు విరివిగా చేస్తారని తెలిపారు. దానధర్మాలు చేయడం అంటేనే మానవత్వానికి ప్రతీక అని, మానవత్వాన్ని చాటేదే రంజాన్ మాసం అని వివరించారు. ప్రార్థనల అనంతరం అందరం అలయ్‌బలయ్ చేసుకోవడంతో సోదరభావం పెంపొందుతున్నదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మన పండుగలకు అనేక నిధులను ఖర్చు చేస్తూ, పండుగలను ఘనంగా జరుపుకునేలా చర్యలు తీసుకుంటుందని వివరించారు. రంజాన్ పండుగ ఇచ్చిన సుహృద్భావ, దాన గుణాలు కలిగి ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని వారు ఆకాంక్షించారు.