వరంగల్

అభివృద్ధి పనులు చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, జూన్ 26: నర్సంపేట నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను చేస్తుంటే నియోజకవర్గంలో గడిచిన మూడేళ్ల కాలంలో అసలు అభివృద్ధే జరగలేదని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు సమంజసమని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేట నగర పంచాయతీ ఇన్‌చార్జి చైర్మన్ మునిగాల పద్మా వెంకట్‌రెడ్డి స్వగృహంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపై పెద్ది సుదర్శన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. నర్సంపేట నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని చెప్పడం ఎమ్మెల్యే దొంతి అజ్ఞానానికి, పరిణతి లేని మాటలకు అద్దం పడుతోందన్నారు.
పూర్తిగా కాంట్రాక్టు పనులకే పరిమితమైన ఎమ్మెల్యే దొంతి నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన పాత్ర జీరో అని విమర్శించారు. నియోజకవర్గంలో మిషన్ కాకతీయ కింద 219 చెరువులను 88.45కోట్లతో పునరుద్ధరించామని, ఇప్పటికే 70 శాతం చెరువుల్లో పనులు పూర్తయ్యాయని తెలిపారు. చాలా చెరువులకు ఎమ్మెల్యే దొంతి, ఆయన అనుచరులు టెండర్లలో దక్కించుకుని కోట్ల రూపాయల బిల్లులను తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. మాధన్నపేట చెరువును మినీ ట్యాంకు బండ్‌గా మలచడంతో పాటు చెరువు పునరుద్ధరణ పనులకు మంత్రి హరీశ్‌రావును ఆహ్వానిస్తే కనీసం టెండర్ పనులు దక్కించుకున్న ఎమ్మెల్యే దొంతి హాజరు కాకపోగా కనీసం జెసిబిని కూడా సమకూర్చకపోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అయినప్పటికీ ఘర్షణ వద్దని భావించి కేవలం పైలాన్‌ను మాత్రమే మంత్రి ఆవిష్కరించి వెళ్లిపోయారని తెలిపారు. నర్సంపేటకు రింగురోడ్డును ప్రతిపాదించి నిధులు మంజూరు చేయిస్తే ఆ పనులను కాంట్రాక్టర్ అయిన ఎమ్మెల్యే దొంతి ఎందుకు చేయడం లేదో చెప్పాలని అన్నారు. ఎస్సారెస్పీ కాల్వలను బలోపేతం చేసే రబీలో సాగునీరు అందించామని, నియోజకవర్గంలో గతంలో కంటే అధికంగా లక్షా 10వేల ఎకరాల్లో ధాన్యం పండిందని వెల్లడించారు. పంచాయతీ రాజ్‌శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో 170 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణానికి 35 కోట్ల రూపాయలను మంజూరు చేయించానని, ఆ పనులను ఎమ్మెల్యే దొంతి చేస్తూనే మరో వైపు అభివృద్ధి జరగడం లేదని చెప్పడం ఏంటని నిలదీశారు.
రోడ్లు, భవనాల శాఖ పరిధిలో నియోజకవర్గంలో 51 కిలోమీటర్లను డబుల్ రోడ్లుగా విస్తరించేందుకు ప్రభుత్వం 68కోట్లు మంజూరు చేసిందని, పనులను దక్కించుకున్న ఎమ్మెల్యే దొంతి కొన్ని పనులను చేసి, మరికొన్ని పనులను ఇంకా పూర్తి చేయలేదన్నారు. రంగయ్య చెరువు రిజర్వాయర్‌గా చేసే క్రమంలో నిర్వాసిత రైతులపై లాఠీచార్జి చేసిన ఘనత ఆనాటి కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు.
ఎవరి వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతుంతో రంగయ్య చెరువు కట్టపై బహిరంగ చర్చకు ఎమ్మెల్యే దొంతి రావాలని సవాల్ విసిరారు.
ల్యాండ్ అసైన్డు కమిటీకి ఎమ్మెల్యే దొంతి చైర్మన్ అని, అదేవిధంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల గ్రామాల ఎంపికకు ఎమ్మెల్యేనే బాధ్యుడు కాగా ఇంతవరకు ఇళ్లకు సంబంధించిన గ్రామాలను ఎంపిక చేయడంలో కాలయాపన ఎందుకు చేశారో ఎమ్మెల్యే ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జూరాల నుండి పాఖాలకు కృష్ణా నది జలాలను తీసుకువచ్చేందుకు తాను కృషి చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే డికె అరుణ, సంపత్‌కుమార్ జూరాల వద్ద ధర్నా చేస్తే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేగా ప్రజలు ఓట్లు వేసారని అయితే ఇంత వరకు ఎమ్మెల్యే ఏనాడూ దొంతి మాధవరెడ్డి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడకపోవడం దారుణమని అన్నారు. రాష్ట్ర మంత్రి వర్గమంతా వివిధ సందర్భాల్లో అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొనేందుకు వస్తే ఏనాడైనా సమస్యలపై నివేదించిన పాపాన పోలేదన్నారు.
ఎమ్మెల్యే దొంతి తన విజన్ ఏంటో నియోజకవర్గ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈవిలేఖరుల సమావేశంలో టిఆర్‌ఎస్ నాయకులు మునిగాల వెంకట్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, మచ్చిక నర్సయ్య, నాయిని నర్సయ్య, డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, కామగోని శ్రీనివాస్, దార్ల రమాదేవి, గుంటి కిషన్, గంప రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.