విజయవాడ

ప్రజాచైతన్యంతో ఆరోగ్యకర సమాజ నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, జూన్ 26: ఆరోగ్యం విషయంలో ప్రజలను చైతన్య పరిచి తద్వారా ఆరోగ్యకర సమాజ నిర్మాణం జరగాలని ఏపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వ్యాఖ్యానించారు. అ న్ని దానాలలోకి అవయవదానం మిన్న అని తెలిపారు. అవయవదానంపై అవగాహన మరింత పెంపొందించే దిశగా ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా నటించిన బ్యాక్ టు ద ఫ్యూచర్ అనే షార్ట్ఫిల్మ్‌ను ఆయన సోమవారం నగరంలోని మధుమాలక్ష్మి ఛాంబర్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ముఖీ మీడియా సంస్థ నిర్మించిన ఈ లఘు చిత్రం దేశంలోని అన్ని సినిమాహాళ్లలో, అన్ని టెలివిజన్ ఛానళ్లలోనూ ప్రసారం కానుందని ఆయన ప్రకటించారు. ఎంతో మంది మరణిస్తున్న క్రమంలో అవయవదానాలను ప్రోత్సహించే ఇటువంటి లఘు చిత్రాలు రూపొందించడం మంచిదన్నారు. మచిలీపట్నం ఎంపి కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ ఇంతటి సున్నితమైన భావోద్వేగాలకు సంబంధించిన అంశాన్ని హృద్యంగా చెప్పిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. సామాజిక చైతన్యం కలిగించే ఇటువంటి లఘుచిత్రాలు నిర్మించడానికి ఎంతో సామాజిక సృహ, మరెంతో నిబద్ధత కావాలన్నారు. ముఖీమీడియా సంస్థ సిఇఓ శివలెంక శంభుప్రసాద్ మాట్లాడుతూ హిందీలో ఇటువంటి ఫిల్మ్ చెయ్యగల అవకాశం రావడం అపూర్వమని, ఇది తెలుగువాళ్లకి దక్కి న గౌరవంగా భావిస్తున్నారని తెలిపా రు. ముఖీమీడియా డైరెక్టర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ జీవన్‌దాన్ ద్వారా కలిగే వెసులుబాటును గురించి సవివరంగా తెలియజేశారు. జీవన్‌దాన్ సిఇ ఓ జి కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడానికి జీవన్‌దాన్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈకార్యక్రమంలో పలువురు ప్రముఖలు పాల్గొన్నారు.