కుర్రహీరో సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డీజే చిత్రంతో కథానాయికా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే మరో చిత్రంలో నటిస్తోంది. శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా రూపొందిస్తున్న ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- సినిమాలో కథానాయికది కీలకమైన పాత్ర అవ్వడంతో పూజా హెగ్డేను ఎంపిక చేశామని, అందంతోపాటు అభినయం ప్రాధాన్యం వున్నదని, పది రోజులపాటు చేసిన షూటింగ్‌తో మొదటి షెడ్యూల్ పూర్తిచేశామని, రెండో షెడ్యూల్‌నుండి హీరోయిన్ పాల్గొంటుందని తెలిపారు. పీటర్ హెయిన్ సినిమా కోసం డిఫరెంట్ ఫైట్స్‌ను డిజైన్ చేస్తున్నారని ఆయన అన్నారు. పూజాహెగ్డేను ఎంపిక చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయని, దర్శకుడు కథానాయికను గ్లామర్‌గా ప్రెజెంట్ చేయనున్నారని, కథకు తగిన విధంగా భారీ హంగులతో రూపొందిస్తున్న ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉంటాయని నిర్మాత అభిషేక్ నామా తెలిపారు. జగపతిబాబు, రవికిషన్, మధు గురుస్వామి విలన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా:ఆర్ధర్ ఏ.విల్సన్, మాటలు:సాయిమాధవ్ బుర్రా, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, రచన, దర్శకత్వం:శ్రీవాస్.