ప్రభాస్ ఓకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మల్లీశ్వరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కత్రినా కైఫ్‌ను అంత త్వరగా మరిచిపోలేం. బాలీవుడ్‌లో హిట్‌మీద హిట్‌లు ఇస్తూ టాప్‌స్టార్‌గా ఎదిగిన కత్రినా ఆ తర్వాత దక్షిణాదివైపు కనె్నత్తి చూడలేదు. తాజాగా ఆమె నటించిన ‘జగ్గా జాసూస్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో కత్రినా కైఫ్ బిజీగా పాల్గొంటోంది. ఈ సందర్భంలో ఓ ఇంటర్వ్యూలో దక్షిణాదిలో అవకాశం వస్తే ఎవరి సరసన నటిస్తారు అని అడిగితే మరో మాట ఆలోచన లేకుండా ప్రభాస్ అయితే ఓకే అని చెప్పేసింది ఈ పొడుగు కాళ్ల సుందరి. తమిళంలో అయితే విక్రమ్ సరసన నటిస్తానంటోంది. తాను వారిద్దరు నటించిన బాహుబలి, ఫ్రాంచైజ్ చిత్రాలు చూసానని చెబుతోంది. మన హీరోలను ఆమె గమనిస్తూనే ఉందన్నమాట.!