అలా ఉంటే చాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహజంగా అమ్మాయిలు తమకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెబుతారు. మరికొందరు ఊహల్లో మునిగి బయటకు చెప్పడానికి ఇష్టపడరు. కానీ హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసి ప్రస్తుతం అవకాశాలు లేక సతమతమవుతున్న హీరోయిన్ పూనమ్ కౌర్ తనకు అచ్చం పవన్‌కల్యాణ్ లాంటి భర్త కావాలంటూ స్టేట్‌మంట్ ఇచ్చింది. తేజ దర్శకత్వంలో వచ్చిన ఒక ‘విచిత్రం’ సినిమాతో హీరోయిన్‌గా మెరిసిన పూనమ్ కౌర్ ఆ తర్వాత అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయింది. ఇటీవల ఓ ఇంటర్యూలో అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం అందర్నీ ఆశ్చర్యపరచింది. అంటే ఆమె ఉద్దేశం ఏమిటంటే పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు భర్తగా కావాలని, అతనిలో వున్న క్వాలిటీస్ తనకు నచ్చుతాయని, అలాంటివాడు దొరికినపుడే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. మరి ఆ పెళ్లికొడుకు ఎక్కడున్నాడో?