అంతర్జాతీయం

ఇజ్రాయెల్ అధ్యక్షుడితో మోదీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసలేం, జూలై 5: ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆ దేశ అధ్యక్షుడు రూవెన్ రివ్లిన్‌ను కలిశారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలను ఎలా బలోపేతం చేసుకోవాలి, ఇజ్రాయెల్ ఆధునిక పరిజ్ఞానం ‘మేక్ ఇన్ ఇండియా’కు ఏ విధంగా తోడ్పడుతుందో చర్చించారు. ఇజ్రాయెల్‌ను నిజమైన మిత్రుడిగా మోదీ అభివర్ణిస్తూ, గత ఏడాది నవంబర్‌లో రివ్లిన్ భారత దేశ పర్యటనను గుర్తు చేసుకున్నారు. ఇరు దేశాల సంబంధాలను మోదీ ప్రశంసిస్తూ ఈ సంబంధాలను ‘ఐ టు ఐ, ఐ ఫర్‌ఐ’గా అభివర్ణించారు. అంటే తన ఉద్దేశం ఇజ్రాయెల్‌కోసం భారతదేశం, భారతదేశం కోసం ఇజ్రాయెల్ అని కూడా మోదీ అన్నారు. అధ్యక్షుడు రివ్లిన్ ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి తనను సాదరంగా ఆహ్వానించారని, ఇది భారతీయుల పట్ల ఇజ్రాయెలీలకున్న గౌరవానికి గుర్తని మోదీ ఒ ట్వీట్‌లో అన్నారు. గత ఏడాది నవంబర్‌లో భారత్‌లో పర్యటించినప్పుడు రివ్లిన్ ప్రదర్శించిన దార్శనికత, చూపించిన ప్రేమాభిమానాలు ఆయనపట్ల గౌరవం మరింత పెరిగేలా చేశాయని మోదీ అధ్యక్షుడి నివాసంలో ఉన్న విజిటర్స్ బుక్‌లో రాశారు. కాగా, ప్రస్తుతం ప్రపంచంలోని గొప్ప నాయకుల్లో మోదీ ఒకరని ఈ సందర్భంగా రివ్లిన్ వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య ఎన్నో సారూప్యతలున్నాయని ఆయన అంటూ, మేక్ ఇన్ ఇండియా పట్ల మీ ఆలోచనలను విజయవంతం చేయడానికి ఇజ్రాయెల్ ఎంతో కృషి చేస్తోందని అన్నారు.