మంచి మాట

కాలగణన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలాన్ని కొలిచేవాళ్లల్లో ఒకరు సూర్యుడు, మరొకరు చంద్రుడు ఉన్నారు. సూర్యుడు ప్రతి నెలలోనూ ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. దీనికే ‘సంక్రమణం’ అని పేరు. కాలాన్ని లెక్కించే క్రమంలో ప్రతి సంవత్సరాన్ని రెండు ఆయనాలుగా విభజించారు. ఒకటి ఉత్తరాయణం, రెండోది దక్షిణాయనం.
సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించడంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఈ సంవత్సరం ఆదివారం జూలై 16 నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. జనవరి 14న వచ్చే ఉత్తరాయణాన్ని మకర సంక్రమణమనీ, జూలై పదహారవ తేదీన వచ్చే దక్షిణాయనాన్ని కర్కాటక సంక్రమణమనీ వ్యవహరిస్తారు. ఏ తిథులతోనూ సంబంధం లేకుండాను, ఎవరినీ అడగక్కర్లేకుండాను సంవత్సరంలో వచ్చే రెండు పండుగలు ఉత్తరాయణ, దక్షిణాయనాలే. భారతదేశంలో ప్రాచీనకాలం నుంచి కాలగణనను అద్భుతంగా చేశారు. పనె్నండు రాశుల్లో సూర్యుని ప్రవేశాన్ని బట్టి ప్రతినెలా సంక్రాంతి వస్తుంది.
సూర్యుడు కర్కాటక సంక్రమణం నుండి మకర సంక్రమణం వరకు అంటే సూర్యుడు కర్కాటకరాశిలోకి ప్రవేశించినప్పటినుంచి తిరిగి మకరరాశిలోకి ప్రవేశించేంతవరకు ఉండే కాలం దక్షిణాయనం. సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణిస్తే ఉత్తరాయణమని, ఉత్తరం నుంచి దక్షిణం వైపు ప్రయాణించే ఆరునెలల కాలాన్ని దక్షిణాయనం అని పిలుస్తారు. దేవతలకు ఉత్తరాయణ కాలం పగలు కాగా, దక్షిణాయనం రాత్రి. ఆషాఢమాసం నుంచి నాలుగు నెలలపాటు అంటే కార్తీక ఏకాదశి వరకు ఉన్న కాలం దక్షిణాయనంలో చాలా పవిత్రమైన కాలం. ఉత్తరాయణం దేవతలకు, దక్షిణాయనం పితృదేవతలకు ఇష్టమని చెబుతారు.
దక్షిణాయనంలో దేవతా ప్రతిష్ఠ, గృహప్రవేశం, ఉపనయనం, వివాహం వంటి శుభకార్యాలు చేయడం మంచిది కాదంటారు. కాని దక్షిణాయనంలో ఉగ్రదేవతా రూపాలను అంటే సప్తమాతృకలు, భైరవ, వరాహ, నరసింహ, మహిషాసురమర్దిని, దుర్గాదేవి వంటి దేవతా మూర్తులను ప్రతిష్ఠించవచ్చని వైఖానస సంహిత చెబుతుంది. ఆధ్యాత్మిక వాదులకు దక్షిణాయనం ఎంతో విలువైనది. కర్కాటక సంక్రమణ సమయంలో అంటే దక్షిణాయన ప్రారంభంలో చేసే పుణ్యస్నానాలు, రోగాలు నివారించబడటమే గాక దారిద్య్రం కూడా నిర్మూలించబడుతుందని శాస్త్ర వచనం. ఈ పుణ్యకాలంలో నెయ్యి గోదానం శ్రేష్ఠమైన ఫలితాలనిస్తుంది. పితృ దేవతలకు తర్పణాదులివ్వాలి. జప, దాన, ఉపవాసాదులు విశేష ఫలితాన్ని కలిగిస్తాయి. ఉత్తరాయణం సాత్విక దేవతారాధనకు, దక్షిణాయనం ఉగ్రదేవతారాధనకు ప్రసిద్ధి వహించాలి.
శ్రీమహావిష్ణువు శయనించేది దక్షిణాయనంలోనే. వాతావరణంలో వేగంగా వచ్చే మార్పులకు తట్టుకొని రోగాల బారిన పడకుండా ఉండాలని పూర్వీకులు రకరకాల దీక్షలు, వ్రతాలు, ఆచారాలను ప్రవేశపెట్టారు. దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి వారికే నేరుగా చేరుతుంది. పితృదేవతలకు సకల నరకాల నుంచి వైదొలగిస్తాయి. నాగపంచమి, వరలక్ష్మీవ్రతం, రాఖీపూర్ణిమ, దసరా, నరకచతుర్దశి, దీపావళి, శివకేశులకు ప్రీతికరమైన కార్తీక, మాఘ మాస స్నానాలు, ధనుర్మాసం ఇవన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి.
రుద్రారాధన, గణనాయకుడైన వినాయకుని ఆరాధన వచ్చేది దక్షిణాయనంలోనే. ఈ సమయంలో రాత్రిళ్లు ఎక్కువగా పగటికాలం తక్కువగా ఉంటుంది. దక్షిణానమున మృతినొందిన వారు చంద్రసాయుజ్యాన్ని పొందగలరని వేదోక్తి. రాత్రి, పగలు సమానంగా ఉండే విషువద్దినము కూడా దక్షిణాయనంలోనే వస్తుంది. ఇన్ని విశిష్టతలు ఉన్న దక్షిణాయన రోజున మనం దైవాన్ని పూజిద్దాం. పాపాలు, దోషాలు పోగొట్టుకుందాం.

-కె.రామ్మోహన్‌రావు