సువర్ణ సుందరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరణ్, సాక్షి చౌదరి జంటగా ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై సూర్య దర్శకత్వంలో ఎం.ఎల్.లక్ష్మి రూపొందించిన చిత్రం 3సువర్ణసుందరి2 (చరిత్ర ఎప్పుడూ భవిష్యత్తును వెంటాడుతుంది). ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన లభిస్తోందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు సూర్య మాట్లాడుతూ, హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా విజువల్ వండర్‌గా రూపొందిందని, కథ, కానె్సప్టు ప్రధానంగా చరిత్రను ఆవిష్కరిస్తూ రూపొందించామని, నేచురల్ సూపర్ థ్రిల్లర్‌గా వుంటుందని తెలిపారు. 1509లో ప్రారంభమై 2017 వరకు నాలుగు శతాబ్దాలలో జరిగిన విశేషాలతో కథనం సాగుతుందని తెలిపారు. కాలాన్ని బట్టి వేరు వేరు లొకేషన్‌లలో చిత్రీకరించామని, బీదర్, కేరళ, కాలికల్, అనంతపూర్, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, చరిత్ర ఎప్పుడూ విజయాల గురించి చెబితే ఈ సినిమా బయటికి తెలియని చీకటి కోణాలను ఆవిష్కరిస్తుందని, రకరకాల జనరేషన్స్‌పై ఆ చీకటి కోణాలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనే కథనంతో సాగుతుందని తెలిపారు. నాటి, నేటి జనరేషన్ గ్యాప్ సూచించడానికి అనేక జాగ్రత్తలు తీసుకున్నామని, ప్రతి సెట్‌కి సిజి చేశామని, చిత్రీకరణ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని, త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. రామ్, ఇందర్, సాయికుమార్, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ఖాన్, అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:ఎల్లు మహంతి, సంగీతం:సాయికార్తీక్, ఎడిటింగ్:ప్రవీణ్ పూడి, నిర్మాత:ఎం.ఎల్.లక్ష్మి, దర్శకత్వం:సూర్య.