దర్శకేంద్రుడికి సారీ చెప్పిన తాప్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినీ పరిశ్రమలో ప్రస్తుతం తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు దర్శకుడు రాఘవేంద్ర రావు కారణమని, ఇటీవల ఓ కామెడీ షోలో తాను చేసిన వ్యాఖ్యలు ఆయనకు బాధ కలిగి ఉంటే తనను క్షమించాలని బహుభాషా హీరోయిన్ తాప్సీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె రాఘవేంద్రరావుకు క్షమాపణలు చెబుతూ తాజాగా 3ఫేస్‌బుక్2లో ఓ వీడియోను పోస్టు చేశారు. ఆమె కొద్దిరోజుల క్రితం ఓ కామెడీ షో సందర్భంగా మాట్లాడుతూ, ఎంతోమంది హీరోయిన్లను రాఘవేంద్రరావు అందంగా చూపించారని, నాభిపై పండ్లు వేయించారని అన్నారు. హీరోయిన్ల నాభిపై పండ్లు వేయడంలో ఏం అందం ఉందో తనకైతే అర్థం కాలేదని తాప్సి చేసిన వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు తప్పుపట్టారు. 2010లో 3ఝుమ్మం ది నాదం2 సినిమా తో రాఘవేంద్రరావు తాప్సీని హీరోయిన్‌గా పరిచయం చేశారని, ఇప్పుడు ఆయనపైనే ఆమె కామెంట్లు చేయడం సరికాదని ఫేస్‌బుక్‌లో చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాప్సీ స్పందించి, రాఘవేంద్రరావు ఇచ్చిన ప్రోత్సాహాన్ని తాను మరచిపోలేనని, ఆయనను అవమానించాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. కామెడీ షోలో తాను సరాదాగా ఆ మాటలన్నాను తప్ప, ఎవరినీ విమర్శించాలన్న ఉద్దేశం లేదని ఆమె వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు పొరపాటున రాఘవేంద్రరావును బా ధిస్తే అందుకు సారీ చెబుతున్నానని ఆమె ప్రకటించారు.