డ్రగ్స్ నేపథ్యంలో వాసుకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయనతార ప్రధాన పాత్రలో మలయాళంలో విజయవంతమైన పుదియ నియమం తెలుగులో వాసుకిగా అనువాదమైంది. శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్.మోహన్ తెలుగులో అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ప్రస్తుతం టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం వైరల్ అవుతోందని, డ్రగ్స్ తీసుకుంటున్న కొందరు యువ హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాలు ‘సిట్’ అధికారుల ముందుకు వచ్చి తమ వాంగ్మూలాలు ఇస్తార’ని తెలిపారు. ఇదే టైమ్‌లో మలయాళం ఇండస్ట్రీలో కథానాయిక భావన, కిడ్నాప్, అత్యాచారం ఉదంతంలో హీరో దిలీప్ అరెస్టు అవ్వడంతో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ రెండు పరిశ్రమలలో వున్న సమస్యల నేపథ్యంతోనే వాసుకి సినిమా రూపొందింది. మలయాళంలో బ్లాక్‌బస్టర్ కొట్టిన ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డ్రగ్స్ బాధితులైన కొందరు యువకులు ఎలాంటి అకృత్యాలు చేశారనే కథనంతో ఈ చిత్రం సాగుతుంది. మాదకద్రవ్యాలను తీసుకొన్నవారు ఎలా ప్రవర్తిస్తారనే పాయింట్ కూడా ఈ చిత్రంలో ఆసక్తికరంగా చిత్రీకరించారు. త్వరలోనే భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు.