కామెడీగా సోడా గోలీసోడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానస్, నిత్యా నరేష్ జంటగా ఎస్.బి.ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై మల్లు హరిబాబు దర్శకత్వంలో భువనగిరి సత్య సింధుజ రూపొందిస్తున్న చిత్రం ‘సోడా గోలీసోడా’. అమలాపురం, పాలకొల్లులలో మొదటి షెడ్యూల్ పూర్తిచేసి ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ను కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పూర్తిచేశారు. అన్ని కార్యక్రమాలు ముగించి ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ఎంత మంచి సినిమాకైనా కామెడీ చాలా అవసరమని, అందుకే ఈ చిత్రంలో ఓ సందేశాన్ని కామెడీతో జోడించి చేశామని తెలిపారు. కమర్షియల్‌గా చూస్తే ఈ రోజుల్లో ఈ కథను తెరకెక్కిస్తే పదిమంది హాయిగా నవ్వుకుంటారన్న ఆలోచనతో రూపొందిస్తున్నామని, పాటల చిత్రీకరణ కూడా పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు వస్తామని దర్శకుడు హరిబాబు తెలిపారు. కారుణ్య, అలీ, గౌతంరాజు, కృష్ణ్భగవాన్, ప్రభాస్ శ్రీను, దువ్వాసి మోహన్, షకలక శంకర్, హైపర్ ఆది, జయవాణి, మాధవి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:్భరత్, పాటలు:రెహమాన్, ఎడిటింగ్:నందమూరి హరి, కెమెరా:ముజీర్ మాలిక్, దర్శకత్వం:మల్లూరి హరిబాబు.