ప్రారంభమైన బటర్ ఫ్లైస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హర్షిణి, రోజాభారతి, మేఘ నరమి, జయ, ప్రవల్లిక ప్రధాన తారాగణంగా భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ రూపొందిస్తున్న చిత్రం బటర్‌ఫ్లైస్. ఆర్.కె.్ఫణిరాజ్ దర్శకత్వంలో రూ పొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రా రంభోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో జరిగింది. అంబికా కృష్ణ క్లాప్‌నివ్వగా, జీవిత రాజశేఖర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ- పూర్తిగా మహిళలతో ఈ సినిమా రూపొందిస్తున్నామని, మూడు సంవత్సరాల క్రితమే వైవిధ్యమైన ఈ కథతో సినిమా చేయాలనుకున్నామని తెలిపారు. మహిళలకు ఎదురవుతున్న కష్టనష్టాలను ఈ చిత్రంలో చర్చిస్తున్నామన్నారు. అందరూ మహిళలతో చేస్తున్న తొలి చిత్రంగా ఈ సినిమా రూపొందిస్తున్నామని దర్శకుడు ఆర్.కె.్ఫణిరాజ్ అన్నారు. ఆడవారిని అసభ్యకరంగా చూపించే చిత్రాలు తగ్గాలని, మహిళలను గౌరవించే చిత్రాలు రావాలని నటి జీవిత అన్నారు. మహిళలను గౌరవిస్తే దేశం విజయపథంలో ఉంటుందని, ఆడది అంటే మాతృత్వం, మృధుస్వభావానికి ప్రతీక అని అంబికా కృష్ణ తెలిపారు. కార్యక్రమంలో హీరోయిన్లు చిత్ర విశేషాలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:కర్ణ ప్యారసాని, సంగీతం:ప్రద్యోతన్, పాటలు:కె.గీత, సాధనాల, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:కె.ఆర్.్ఫణిరాజ్.