విజయవాడ

బడ్జెట్‌లో మోడల్ స్కూళ్లకు నిధులు కేటాయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 17: మోడల్ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి మే నెల నుండి పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించాలని, మోడల్ స్కూళ్లను రాష్ట్ర ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ మురళీమోహన్ అధ్యక్షతన ఐదు రోజులపాటు జరిగే నిరాహారదీక్షలు సోమవారం ధర్నా చౌక్‌లో ప్రారంభించారు. ఈ దీక్షలను ప్రారంభించిన పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ అన్ని పబ్లిక్ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించిన మోడల్ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు చెల్లించలేని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ బడ్జెట్‌లో నిధులను కేటాయించి 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏపిఎంఎస్‌టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ మురళీమోహన్ మాట్లాడుతూ 10వ పిఆర్‌సి బకాయిలను చెల్లించాలని, నూతన పెన్షన్ స్కీంను వర్తింపజేయాలని, హిందీ పిజిటి పోస్టును కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, జెఎసి సెక్రటరీ జనరల్ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నెలనెలా జీతాలు ఇవ్వలేకపోవటం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాబురెడ్డి మాట్లాడుతూ మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఏపిఎంఎస్‌టిఎఫ్ ప్రధాన కార్యదర్శులు ఎన్ బోసుబాబులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో మోడల్ స్కూళ్లకు నిధులను కేటాయించాలని, ప్రతి నెలా 1వ తేదీన జీతాలు విడుదల చేసే విధంగా ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ ఇవ్వాలని లేదంటే జూలై 24వ తేదీన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయాన్ని వేల మంది ఉపాధ్యాయులతో ముట్టడించాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం జరిగిన సామూహిక నిరాహారదీక్షలో అనంతపురం, విజయనగరం, కడప జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సోమవారం దీక్షలను యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ వెంకటేశ్వరరావు, పి బాబురెడ్డి నిమ్మరసం ఇచ్చి విరపింపచేశారు.