మంచి మాట

ఆదర్శ మూర్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టిలో యుగాలు మారుతూంటాయి. నాలుగు యుగాలు కలిపి ఒక కల్పం అంటారు. మానవులు మంచి ప్రవర్తనను కలిగియున్నది స్వర్గంగా అనుకుంటే చెడ్డ ప్రవర్తన నరకానికి దారి అనుకోవచ్చును.
స్వర్గ నరకాలు రాత్రింబవళ్ళు వలే నిరంతరం వచ్చిపోతూంటాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం-ఈ నాలుగు యుగాలు కలిపి ఒక కల్పముగా చెప్పబడును. సత్యయుగంలో ప్రజలు 16 కళలతో రాణించేవారు. ఆ యుగానికి లక్ష్మీ నారాయణుల పాలన జరిగేది. దీనినే కృతయుగం అంటారు. సత్యయుగంలో మానవుని ఆయుష్షు 1250 సంవత్సరాలు. అప్పటి యుగకాలం 17,28,000 సం.గా చెప్తారు. సత్యయుగంలో మానవులు ధర్మవర్తనులుగా జీవించేవారు.
త్రేతాయుగంలో సీతారాముల పరిపాలన. ఇందులో కూడా మానవుని ఆయుష్షు 1250 సంవత్సరాలు. ఈ యుగకాలం 12,96,000 సంవత్సరాలు. ఇచ్చట 14 కళలతో మానవులు విరాజిల్లేవారు. త్రేతాయుగంలో లక్ష్మీనారాయణులే సీతారాములుగా జన్మించడం జరిగింది. భగవంతుడే ఆ అవతారంగా జన్మించడం అంటే దానికొక అర్థం పరమార్థం తప్పక ఉంటుంది. ఆ విధంగా సీతారాముల జననం కూడా జరిగింది.
సత్పురుషులను పరిరక్షించుటకు, దుష్టులను రూపుమాపుటకు, ధర్మమును సుస్థిరమొనర్చుటకు ప్రతీ యుగంలో పరమాత్మ అవతారం జరుగుతూ ఉంటుంది. రావణ సంహారం, రామావతారం కారణం.
అత్యంత ప్రధానమైన విషయం- మానవులు ధర్మం తప్పి ప్రవర్తించకుండా ఉండుటకుగాను భగవంతుడే జీవన సత్యాన్ని మానవులకు ప్రబోధించడం జరిగింది. ఒక మనిషి జన్మించాక తల్లిదండ్రుల యెడల తన ప్రక్కన పుట్టిన సోదర, సోదరీమణుల యెడ పెళ్లి చేసుకున్నాక భార్య యెడల భర్త, భర్త యెడల భార్య, బంధువుల యెడల రక్తసంబంధాల, బంధుగణంతో ఎలా ప్రవర్తించాలి అనేది ఋషిగణాలతో, పెద్దలతో ఎలా ప్రవర్తించాలనేది. ఈ విషయాలన్నింటిని గూర్చి తాను తెలియజేసే విధంగా తన ప్రవర్తన కలిగి రామయ్యతండ్రి ప్రవర్తించి మనకు తెలియజేశారు. ప్రతీ విషయం తన సౌజన్యంతో అరటిపండు తొక్క వలచి నోటిలో తినమని పెట్టినంత విధంగా ధర్మాన్ని ధర్మసూక్ష్మాలని తెలియజేశారు. శ్రీరాముడు స్వయంగా రాజు అయి వుండి సామాన్యులను కూడా ఎలా గౌరవించాలనేది తెలియజేశారు. తన మర్యాదపూర్వకమైన చక్కటి సౌజన్య సుగుణవంతమైన ప్రవర్తనతో ప్రజలందరూ తనకు కావలసిన వారే అన్న విషయం అందరి యోగక్షేమాలు చూడటం ప్రతి ఒక్కరి మాటకు విలువ ఇవ్వడం ద్వారా శ్రీరాముని గొప్పతనం తేటతెల్లమవుతుంది.
తాటకి అధర్మ అసుర ప్రవర్తన అంతమొందించుటకై తాటకి సంహారం జరిపినా, దానిపై పశ్చాత్తాపపడటం, గౌతముని భార్య అహల్య శాప విమోచనం, శబరి అకుంఠిత భక్తిని ఎంగిలి ఫలాలు సైతం గ్రహించడం, కైకేయిని స్వంత తల్లి కౌసల్య మాతవలె ఇంకా చెప్పాలంటే తల్లికంటే ఎక్కువగా గౌరవించడం, తండ్రి కైకేయికి ఇచ్చిన వరాలను తీర్చుటకై, తండ్రిమాట ఇచ్చినందుకు ఏ మాత్రం కినుకపడక కర్తవ్య దీక్షతో అమలు జరుపుటకు 14 సంవత్సరాలు వనవాసం చేశాడు.
వనవాసం వెళ్ళేటప్పుడు ప్రయాణంలో గుహుని మాట గౌరవించి పాదాలు కడిగాక పడవ ఎక్కడం చేశారు. వనవాసంలో వానరుల పరిచయం హనుమంతుడు తన సోదర సమానంగా స్వీకరించాడు.
సుగ్రీవుని దుర్నీతిపరుడైన వాలినుండి రక్షించడం మంచి ప్రవర్తన కలిగినవానికి రక్షణ ఇవ్వడం ఇలా అనేకం చెప్పుకుంటే పోతే విభీషణుని ఆశ్రయం అనేకానేకం రాముని జీవితం విశేషాలు. ఇన్ని విషయాలు మనిషిగా జీవిస్తూ మనిషి ఎలా జీవించాలో తెలియజేశాడు.
పట్ట్భాషేకం తండ్రి చేతుల్లో జరగలేదు సరికదా, వనవాసానంతరం పట్ట్భాషిక్తులయాక కూడా ఒక సామాన్యుడు కోపంతో అన్న మాటను కూడా ప్రజానురంజక పాలకునిగా శిరసావహించి సీతను త్యజించి అడవులకు పంపడం జరిగింది. మనిషి జీవితం పూల పాన్పు కాదు, అడుగడుగునా మళ్లుంటాయి. ఆ ముళ్ళను దాటగలిగితే పూలపానే్ప. భగవంతుని చరణాలు దొరకగలవని మనకు శ్రీరాముని చరిత్ర అవగాహన పడితే తెలియగలదు. సీతారాముల చరితం ఎన్ని జన్మలకైనా మనకే కాదు ఎన్ని యుగాలవారికైనా జీవితానికి ఆదర్శమూర్తులు.

-ఎ.నాగభూషణరావు