వరంగల్

జీఎస్టీ..వ్యాపారులకు ఉపయోగకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జూలై 20: వస్తుసేవల పన్ను(జిఎస్టి) వినియోగదారులతో పాటు వ్యాపారులకు ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వాణిజ్యపన్నుల శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీపై ట్రేడర్స్, వ్యాపారులు, వినియోగదారలుతో అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ.. ఈ సంవత్సరం జూలై 1నుండి కేంద్రప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వస్తుసేవల పన్ను వ్యాపారులకు, ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. జిఎస్టి విధానంలో కొన్ని సానుకూలతలు ఉన్నాయని రూ.20లక్షల లోపు వార్షీక టర్నోవర్ ఉన్న వ్యాపారులకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని, 20నుండి 75లక్షల వరకు వ్యాపారం చేసే వారు ఒక్కశాతం మాత్రమే పన్ను చెల్లించాలని తెలిపారు. జిల్లాలో చాలామంది వ్యాపారులు 20లక్షల లోపు టర్నోవర్ చేసే వారు ఉన్నందున వారికి పన్ను నుండి మినహాయింపు ఉందని తెలిపారు. ఈ డిమానిటైజేషన్ తర్వాత కేంద్రప్రభుత్వం జిఎస్టి కొత్తపన్ను విధానాన్ని తీసుకొచ్చి దేశం అభివృద్ధి కోసం ముందడుగు వేస్తుందని తెలిపారు. జిఎస్టి పన్నువిధానం అమల్లోకి రావడం వల్ల గతంలో గల 17రకాల పన్నులు రద్దయినట్లు తెలిపారు. మార్కెట్‌ల ధరలను సిద్ధంగా ఉంచుటకు కేంద్రప్రభుత్వం నూతన పన్ను విధానాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. అవగాహన సదస్సులు నిర్వహించి జిఎస్టి అసలు స్వరూపం, స్వభావాలను వినియోగదారులకు, వ్యాపారులకు విడమరిచి చెప్పి వారిలో గల భయాందోళనలను పొగొట్టాలని, జిల్లా వాణిజ్య అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఈ సదస్సులో జిల్లాలోని వ్యాపారులు, ప్రజల నుండి వచ్చిన సందేహాలను జిల్లా వాణిజ్య పన్నుల అధికారి సాగర్ నివృత్తిచేశారు.