అదిలాబాద్

త్వరలోనే జిల్లాకు సిఎం రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, జూలై 20: జిల్లా కేంద్రంలోని భీమన్నగుట్ట వద్ద రూ.30 కోట్ల నిధులతో నిర్మించనున్న జిల్లా కలెక్టరేట్, జిల్లా పోలీసు అధికారుల భవన సముదాయానికి శంకుస్థాపన చేసేందుకు త్వరలోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్మల్‌కు రానున్నారని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. గురువారం ఈ మేరకు సమీకృత భవనాలను నిర్మించనున్న భీమన్నగుట్ట స్థలాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యంకోసం కొత్త జిల్లాలను ఏర్పాటుచేశారన్నారు. అధికారులు ప్రజలకు చేరువైతే సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుందన్న ఉద్దేశంతో రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా మార్చారన్నారు. ఇందులో భాగంగా నిర్మల్‌ను కూడా జిల్లాగా ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. నూతనంగా ఏర్పడ్డ జిల్లాలో కలెక్టరేట్, జిల్లా పోలీసు అధికారుల భవన సముదాయం నిర్మించేందుకు అవసరమైన 25 ఎకరాల స్థలం ఒకేచోట లేనందున పట్టణ శివారులోని భీమన్నగుట్టను ఎంపికచేశామన్నారు. భీమన్న గుట్టకు వచ్చేందుకు మూడువైపుల నుండి దారులు ఉన్నాయని, ఇక్కడ కార్యాలయాలు నిర్మిస్తే ప్రజలకు అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. రూ.30 కోట్ల నిధుల వ్యయంతో 15ఎకరాల స్థలంలో కలెక్టరేట్, 10 ఎకరాల స్థలంలో జిల్లా పోలీసు అధికారుల భవన సముదాయాలు నిర్మించనున్నామని తెలిపారు. రెవెన్యూ, పోలీసుశాఖలు గతంలోనే భీమన్న గుట్టను పరిశీలించడం జరిగిందన్నారు. కలెక్టరేట్, పోలీసుశాఖ భవన సముదాయం నిర్మాణం పనులకు టెండర్లు పూర్తయ్యాయని, ఎన్‌సిసి కంపెనీకి పనులను అప్పగించడం జరిగిందన్నారు. భీమన్న గుట్టపై భూమిని చదునుచేసి 15 రోజుల్లోగా ముఖ్యమంత్రిచే శంకుస్థాపన చేయించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, ఎఫ్‌ఎస్‌సిఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ దేవేంధర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎ రాజేంధర్, నాయకులు హరీష్‌రావు, ఆర్‌అండ్‌బి ఈఈ శ్రీనివాస్‌రావు, డిఈ బాపురెడ్డి, డిఎస్పీ మనోహర్‌రెడ్డి, సిఐలు జీవన్‌రెడ్డి, జాన్ దివాకర్, తహశీల్దార్ శంకర్‌లతోపాటు టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.