తూర్పుగోదావరి

అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 20: ఏజన్సీలో అంటు వ్యాధులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సూచించారు. జిల్లా కేంద్రం కాకినాడలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కలెక్టర్ కార్తికేయ మిశ్రాతో గురువారం చినరాజప్ప సమావేశమయ్యారు. అంతకు ముందు అతిథి గృహం వద్ద పోలీసులు కవాతుతో మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చినరాజప్ప కలెక్టర్‌తో ఆయా అంశాలను సమీక్షించారు. తొలుత కాకినాడ జంతు హింస నివారణ సంఘం (ఎస్‌పిసిఎ)లో మృత్యువాతకు గురైన గోవుల విషయమై సమీక్షించారు. కేంద్రంలో మిగిలివున్న గోవుల పరిరక్షణకు తక్షణం చర్యలు తీసుకోవాలని, గోవుల మృతికి కారకులైన వారిపై చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, జిల్లాలోని అన్ని ప్రాంతాలు, ముఖ్యంగా గిరిజన ఆవాసాల్లో అంటు రోగాల నుండి ప్రజలను రక్షించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాజమహేంద్రవరం గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని ఇఎస్‌ఐ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇఎస్‌ఐ ఆసుపత్రి ప్రాంగణంలో నీరు నిల్వ ఉందని, దీని కారణంగా దోమలు విజృంభించే అవకాశాలున్నట్టు చినరాజప్ప హెచ్చరించారు. తక్షణం అక్కడి నుండి మురుగునీటిని తొలగించాలని మున్సిపల్ కమిషనర్ అలీం పాషాకు సూచించారు. కాపు కార్పొరేషన్, బిసి కార్పొరేషన్ల కార్యాలయాలను మినీ కనె్వన్షన్ హాల్స్ మాదిరిగా నిర్మాణాలు జరిగేలా చూడాలన్నారు. వీటి నిర్మాణం కోసం కాకినాడలో స్థలాలు గుర్తించామని చెప్పారు. కాకినాడ స్మార్ట్‌సిటీని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రాజెక్ట్ నివేదికలు సిద్ధమయ్యాయని తెలిపారు. అభివృద్ధి పనులు ఆగస్టు నుండి మొదలయ్యి, డిసెంబరు నాటికి సిద్ధమవుతాయని చెప్పారు. కాకినాడ నగరంలో జిల్లా పరిశ్రమల కేంద్రం భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్లు మంజూరు చేస్తూ త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తుందని, ఈ భవనాన్ని అత్యాధునికంగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చినరాజప్ప తెలిపారు.