శ్రీకాకుళం

లబ్ధిదారులకు సకాలంలో రుణాలను అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 21: నిరుపేదలకు సకాలంలో రుణాలను అందించి పేదరికాన్ని పారద్రోలాలని ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ జి ఎస్ ఆర్ కె ఆర్ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా, మండల స్థాయి బ్యాంకు అధికారులతో కార్పొరేషన్ రుణ ప్రణాళికలపై ఇంటరాక్షన్ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ ఎస్సీ,బీసి, ఎస్టీ కాపు తదితర కార్పొరేషన్లద్వారారుణాల అందజేత, స్కాలర్‌షిప్‌ల మంజూరు వంటి కార్యక్రమాలు ఒకే పందాలో నిర్వహించడానికి ఓబి ఎం ఎం( ఆన్‌లైన్ బెనిఫీషియర్ మేనేజ్‌మెంట్ మోనటరింగ్ సిస్టమ్‌ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. గతేడాది ఈ కార్యక్రమాన్ని జిల్లాలో చక్కగా అమలు చేయడం హర్షణీయమన్నారు. వివిధ యూనిట్లను ఏర్పాటు ద్వారా నిరుపేదలు లబ్ధిపొందడానికి సబ్సీడితో కూడిన రుణాలు అందించడం జరుగుతుందన్నారు. యూనిట్లను స్థాపించిన నాడే రుణాలు సద్వినియోగం అవుతాయన్నారు. ఈవిషయమై లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. యూనిట్లను నెలకొల్పనివారిపై చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో కమిటీ సభ్యులతో పాటు బ్యాంకులు తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ డాక్యుమెంటేషన్ సాంక్షన్ ప్రక్రియలు ఒక ప్రణాళికాబద్ధం చేయాలన్నారు. వీటి పర్యవేక్షణకు మండలానికి ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. జియోట్యాగింగ్ , ఆరు నెలలకొకసారి పరిశీలన చేయడం ద్వారా పొరపాట్లకు ఆస్కారం ఉండదన్నారు. లబ్ధిదారుల ఎంపిక జరిగిన 48 గంటలలో బ్యాంకులకు జాబితాలను పంపించాలని, ఏడు రోజులలో బ్యాంకు అకౌంట్‌లు ప్రారంభం కావాలన్నారు. అక్టోబర్ లోగా థర్డ్‌పార్టీవెరిఫికేషన్ పూర్తి కావాలని సూచించారు. యుటిలైజేషన్ సర్ట్ఫికేట్ అప్‌లోడ్ తప్పనిసరిగా చేయాలన్నారు. నిరుపేదలకు ఒక సేవాధృక్పధంతో నాణ్యమైన సేవలను అందించి పేదరికాన్ని పారద్రోలడానికి సమన్వయంతో అధికారులు పనిచేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డి మాట్లాడుతూ సకాలంలో రుణాలను అందజేయడానికి ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామన్నారు. వ్యక్తిగత రుణాలు, భూమి కొనుగోలు పథకం, భూమి అభివృద్ధి పథకాలకు కార్పొరేషన్ రుణాలను అందిస్తుందన్నారు. భూమి కొనుగోలు పథకంలో 22 ఎకరాలను గుర్తించడం జరిగిందన్నారు. ఉపాధి హామీ కన్వర్జెన్సీతో భూమి అభివృద్ధి పథకం అమలు చేస్తున్నామన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని ఎంపికైన జాబితాలో ఎవరినీ తొలగించరాదని తెలిపారు. 2016-17వ సంవత్సరంలో గ్రౌండింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని గత ఆర్థిక సంవత్సరాల్లో ఉన్న బ్యాక్‌లాగ్ పనులను పూర్తి చేయాలని తెలిపారు. అంబేద్కర్ స్కిల్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు ఐదెకరాల స్థలాన్ని కొనుగోలు చేయాలన్నారు. భూమి కొనుగోలు పథకం నిమిత్తం తహశీల్దార్లు, ఎంపిడివోలు సంయుక్తంగా భూములను గుర్తించాలన్నారు. భూమిపై పనిచేసేవారు భూ యజమానులుగా మారితే వారి ఆనందానికి హద్దులు ఉండవని నిరుపేదలకు భూ కొనుగోలు, అభివృద్ధి పథకాలను అందించివారి అభ్యున్నతికి అధికారులు కృషి చేయాలన్నారు. జెసి చక్రధరబాబు మాట్లాడుతూ ప్రతీ యూనిట్‌ను చిత్రీకరించాలని, ఫిజికల్ ఫైనాన్షియల్ టార్గెట్‌లను సరిచూసుకోవాలన్నారు. భూమికి సంబంధించిన యూనిట్లను నెలకొల్పిన నాడే రుణాలు సద్వినియోగం అవుతాయన్నారు. తహశీల్దార్లు భూములు గుర్తించడంలో చొరవ చూపాలన్నారు. బ్యాంకర్లు రుణాలు మంజూరుకు సహకరించాలన్నారు. కమిటీ మెంబర్లు పేర్లు మొబైల్‌నెంబర్లు ఫోటోల వివరాలు సేకరణతో పక్కాగా అన్ని ప్రక్రియలు జరుగుతాయని సూచించారు. అనంతరం తహశీల్దార్లు, ఎంపిడివోలు, బ్యాంకు అధికారులతో రుణాల అందజేత ప్రక్రియలో లోటుపాట్లను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం పక్కాగా అమలు చేయడానికి పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ సలహాదారు వర్ధన్, జెడ్పి సి ఈవో నగేష్; డి ఆర్ డి ఏ పిడి కిషోర్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఇడి ఆదిత్యలక్ష్మీ,జిల్లా పంచాయతీ అధికారి కోటేశ్వరరావు, లీడ్‌బ్యాంకు మేనేజర్ వెంకటేశ్వరరావు, ఆర్డివోలు దయానిధి, గున్నయ్య తహశీల్దార్లు మండలాభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.