అంతర్జాతీయం

తీర్పు వస్తే షరీఫ్‌కు ఇబ్బందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 21: పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై దాఖలైన పనామా అవినీతి ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు విచారణ ముగిసింది. ఇరు పక్షాల వాదనలు విన్న పాక్ అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును వాయిదా వేసింది. ఈ తీర్పు వెలువడితే నవాజ్ షరీఫ్ రాజకీయ భవితవ్యం ఇరకాటంలో పడే అవకాశం ఉందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ ముగిసినప్పటికీ తమ తీర్పు ఎప్పుడు వెల్లడించేది ముగ్గురు సభ్యుల న్యాయమూర్తుల బెంచ్ ప్రకటించలేదు. అయితే తాము ఏ తీర్పునిచ్చినా చట్టానికి అనుగుణంగానే ఇస్తామని జస్టిస్ సరుూద్ స్పష్టం చేశారు. పిటిషన్‌దారులు, కక్షిదారుల ప్రాథమిక హక్కులకు సంబంధించి తమకు పూర్తి అవగాహన ఉందని ఈ బెంచ్ పేర్కొంది. ఇప్పటికే నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబసభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తుచేసిన సంయుక్త దర్యాప్తు బృందం అందించిన నివేదికలోనూ తుది భాగాన్ని కూడా సుప్రీంకోర్టు పరిశీలించింది. అయితే ఈ తుది నివేదికను రహహ్యంగా ఉంచాలని ఈ దర్యాప్తు బృందం కోరింది. అందుకు కారణం ఇతర దేశాలతో జరిగిన సంభాషణల వివరాలు ఇందులో ఉండటమేనని తెలిపింది. ఇందుకు షరీఫ్ తరపు న్యాయవాదుల బృందం అభ్యంతరం తెలపడంతో ఈ తుది భాగం కాపీలను ఆయనకు న్యాయవాది వాజా హరీస్‌కు అందించాలని కోర్టు ఆదేశించింది. తీవ్రస్థాయిలో అవినీతికి పాల్పడ్డ నవాజ్ షరీఫ్‌ను డిస్మిస్ చేయాలని ప్రతిపక్షాలు తీవ్రంగానే పట్టుబడుతున్నాయి. తన ఆదాయ వివరాలను, అందుకు సంబంధించిన ఆధారాలను అందించడంలో షరీఫ్ విఫలమయ్యారని ఆరోపించాయి. లండన్ పార్క్‌లైన్‌లో నాలుగు ఖరీదైన ప్లాట్లతో సహా షరీఫ్ కుటుంబ సభ్యులు విలాసవంతమైన భవనాలు, వ్యాపార సంస్థలు ఉన్నాయని, అవి ఎలా వచ్చాయన్నదానిపై ఆయన ఎలాంటి ఆధారాలను అందించలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కోర్టు తీర్పు ఎలా వస్తుందన్న దానిపైనే షరీఫ్ రాజకీయ భవితవ్యంతో పాటు పాకిస్తాన్ రాజకీయ స్థితిగతులు కూడా ఆధారపడి ఉంటాయి. తీర్పు ప్రతికూలంగా వస్తే ప్రధానిగా షరీఫ్‌ను అనర్హుడిగా ప్రకటించడంతోపాటు మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశమూ ఉంటుంది. గత ఏడాది పనామా పత్రాలు లీకైనప్పటినుంచి షరీఫ్‌ను అవినీతి ఆరోపణలు చుట్టుముడుతూనే వచ్చాయి.