నా కెరీర్‌లో గౌతమ్‌నంద బెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్ హీరోగా హన్సిక, కేథరిన్‌లు హీరోయిన్లుగా సంపత్‌నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 3గౌతమ్‌నంద2. శ్రీ బాలాజీ సినీ మీడియా సంస్థలో జె.్భగవాన్, జె.పుల్లారావులు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 28న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్‌తో ఇంటర్వ్యూ..
* గౌతమ్‌నంద ఎలా ఉంటాడు?
- నా పాత్ర పేరు ఘట్టమనేని గౌతమ్. అయితే ఓ మామూలు గౌతమ్. గౌతమ్‌నందగా ఎందుకు మారాడు అనే విషయం కథలో తెలుస్తుంది. ఈ చిత్రంలో ఇప్పటివరకు లేనివిధంగా సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తాను. ఇప్పటికే నా లుక్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇక సినిమా విషయానికి వస్తే, నా చివరి చిత్రం వచ్చి ఏడాదికిపైగా దాటిపోతుంది. అయితే ఈ చిత్రంపై నేను చాలా నమ్మకంగా ఉన్నా.
* దర్శకుడు సంపత్‌నంది గురించి..
- నా కెరీర్‌లో నాకు బాగా కనెక్ట్ అయిన దర్శకులు ఐదారుగురు ఉంటారు. వారిలో సంపత్‌నంది ఒకరు. ఆయన సెట్‌లో చాలా క్లియర్‌గా ఉంటాడు. అతనికి ఎలాంటి వేరియేషన్స్ కావాలో అడిగి మరీ చేయించుకుంటాడు. అతను నాకు కథ చెప్పిన దానికంటే చాలా గొప్పగా ఇందులో అతని ప్రెజెంటేషన్ ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన చిత్రాలతో పోలిస్తే గౌతమ్‌నంద అతని కెరియర్‌లో బెస్ట్ సినిమా అవుతుంది.
* బడ్జెట్ బాగా పెరిగిందని...?
- ఈ చిత్రం నా కెరీర్‌లోనే మంచి బడ్జెట్‌తో రూపొందింది. అయితే ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఎందుకంటే సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికంటే ముందుగానే, దర్శకుడు సంపత్ నంది, నిర్మాతలు భగవాన్, పుల్లారావుగారితో మాట్లాడి, అంతా ఓకే అనుకున్న తర్వాతే సినిమా స్టార్ట్ చేశాం.
* సినిమాల ఎంపిక విషయంలో రాంగ్ స్టెప్ వేసారా?
- సినిమాల ఎంపిక విషయంలో కొన్ని రాంగ్ స్టెప్స్ వేసిన మాట వాస్తవమే. కాని కొన్నిసార్లు పరిస్థితులు మన చేతుల్లో వుండవు. వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లడమే. మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఒక సంవత్సరం ఎదురుచూడాల్సి వచ్చింది. అయితే ఇలాంటి అన్నింటికీ గౌతమ్‌నంద సినిమా సమాధానం చెబుతుంది. నేను ప్రేమకథ చేసినా, మరో జోనర్ సినిమా చేసినా అందులో యాక్షన్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటాను. ఎందుకంటే నా బలమైన అంశాల్లో యాక్షన్ ఒకటి. అందుకే నా సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు ఖచ్చితంగా ఉండాల్సిందే.
* ఆక్సిజన్ సినిమా గురించి?
- ఆక్సిజన్ సినిమా కథకు తగ్గ టైటిలే. మంచి కథ, కొన్ని రోజులు షూటింగ్ బాలెన్స్ ఉంది. ఆ పార్ట్‌ను షూట్ చేసిన తరువాతే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చూసుకుని విడుదల తేదీ ప్రకటిస్తారు. నేను కూడా ఆక్సిజన్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
* డ్రగ్స్ వ్యవహారం?
- డ్రగ్స్ గురించి ఇప్పుడు వస్తున్న వార్తలు చూసి చాలా బాధపడ్డా. అయితే సినిమా పరిశ్రమ మీద అందరూ ఎక్కువగా ఫోకస్ పెట్టడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అసలు ఈ డ్రగ్ రాకెట్‌ను మూలాల నుంచి పెకిలించడానికి పాఠశాలలమీద కూడా ప్రభుత్వం దృష్టిపెట్టి దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తా.
* తదుపరి చిత్రాలు?
- ప్రస్తుతానికి ఏ చిత్రాలకు సంతకం చేయలేదు. కథలైతే వింటున్నా. గతంలో మాదిరిగా విలన్ పాత్రలు, సహాయక పాత్రలు చేసి కెరీర్ పాడుచేసుకునే ఉద్దేశం లేదు. మంచి పాత్రలు ఎంచుకుని కెరీర్‌ను ప్లాన్ చేసుకునే విధంగా ఆలోచిస్తున్నా.

- శ్రీ