పైచూపుతోనే పైపైకి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో రెండు సినిమాలు చేసిన పూజా హెగ్డే బాంబే కలలతో వెళ్లిపోయింది. ఆ తరువాత దువ్వాడ జగన్నాధం చిత్రంతో టాలీవుడ్‌కి తిరిగి వచ్చింది. డిజె ఫలితం ఎలా వున్నా ఈ చిత్రం ఆమెకు ప్లస్ అయిందనే చెబుతున్నారు. తెరపై అందాల ఆరబోతతో గ్లామర్ డోస్ పెంచేసిన ఈ అమ్మడుకి మరిన్ని అవకాశాలు రానున్నాయట. పెద్ద పెద్ద బానర్లనుండి ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె నిరంతర చర్చలతోనే గడుపుతోందట. ఇఫ్పటికే ఓ స్టార్ హీరో సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందని చెబుతున్నారు. మరో రెండు ప్రాజెక్టులు ఆమె ఖాతాలో పడనున్నాయట. ఇవన్నీ ఖరారైతే పూజా హెగ్డే హీరోయిన్ల రేసులో పైపైకి వెళ్లే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. నిర్మాతలను భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా అందాల ఆరబోతకు సిద్ధమని సంకేతాలు ఇవ్వడంతో నిర్మాతలు కూడా ఆమెను తమ చిత్రాల్లో బుక్ చేయడానికకి క్యూ కడుతున్నారట. చూద్దాం పూజా హెగ్డే ఎంతవరకు కేరీర్‌ను అభివృద్ధి చేసుకుంటుందో!