విశాఖ

పాఠశాలల పనితీరుపై ఐటిడిఎ పిఓ అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు: ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండడం, రికార్డుల నమోదు సక్రమంగా లేక పోవడంపై ఐ.టి.డిఎ. పి. ఓ. రవిసుభాష్ అసంతృప్తి వ్యక్తం చేసారు. మండలంలోని మారుమూల యు.చీడిపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల అక్కడ పి.హెచ్.సి.తో పాటు కొయ్యూరు బాలురు-2 ,రాజేంద్రపాలెం పి.హెచ్.సి.లను పి. ఓ. గురువారం సందర్శంచి పరిశీలించారు. యు.చీడిపాలెం ఆశ్రమ పాఠశాలలో 132 మంది విద్యార్థులకు 66 మంది మాత్రమే ఉండడం, పాఠశాల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసారు.
విద్యార్థులు పూర్తి స్థాయిలో ఎందుకు రాలేదని ఫ్రశ్నించారు. విద్యార్థుల సంఖ్యను మరింత పెంచే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామంలో జ్వరాల తీవ్రత విషయమై అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కొయ్యూరు బాలురు-2లో హాజరు కాని విద్యార్థుల వివరాలు మూమెంట్ రిజిష్టర్ నమోదు చేయకపోవడంపై వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే ఫ్రధానోపాధ్యాయులు లీవ్‌లో ఉండటం, పలువురు సిబ్బంది లేకపోవడంపై ఆరా తీసారు. 5,6 తరగతుల విద్యార్థులచే లెక్కలు చేయించి పాఠ్య పుస్తకాలు చదివించగా వారు సరిగా చదవలేకపోవడం, ఆలస్యంగా లెక్కలు చేయడంపై పెదవి విరిచారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదును పరిశీలించారు. రాజేంద్రపాలెం పి.హెచ్.సి. పరిధిలో జ్వరాలు, వ్యాధులపై వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ఓ.పి. నమోదును పరిశీలించారు. గర్భిణీలకు కావాల్సిన మంచాలు సదుపాయాలు లేకపోవడం, ఇతర సమస్యలను వైద్యాధికారి పి. ఓ.కు వివరించారు.
పి.హెచ్.సి.కి రానటువంటి మారుమూల 17 గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టి మెరుగైన వైద్య సేవలందించాలని పి. ఓ. సూచించారు. అన్ని పి.హెచ్.సి.లకు సిబ్బంది నియామకం జరిగిందని, త్వరలోనే వారు విధుల్లో చేరుతారన్నారు. జి.సి.సి. ఆధ్వర్యంలో కాకరపాడులో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ ధరల వ్యత్సాసంపై విలేకరులు పి. ఓ. దృష్టికి తీసుకువెళ్ళగా తక్షణం పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని జి.సి.సి. అధికారులను ఆదేశించారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలు
రావికమతం: ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న సంఘటనలో ఇద్దరికి గాయాలైన సంఘటన దొండపూడిలో గురువారం చేసుకుంది. కిత్తంపేటకు చెందిన బెన్నంనాయుడు కొత్తకోట నుంచి స్వగ్రామానికి , గర్నికం గ్రామానికి చెందిన కె.లక్ష్మణ కొత్తకోటకు వస్తూ దొండపూడి చెరువు వద్ద పాదచారులను తప్పించబోయి ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే కొత్తకోట పెట్రోల్ బంక్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొని డౌనూరుకు చెందిన నానిబాబు, పొన్నవోలుకు చెందిన పి.శ్రీను, క్రిష్టం నాయుడులకు తీవ్ర గాయాలయ్యాయి.
అంభేరుపురంలో అగ్నిప్రమాదం
చోడవరం: మండలంలోని అంభేరుపురం గ్రామంలో బుదవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించి మూడు తాటాకు ఇళ్లు, పశువుల పాకలు దగ్దం కాగా దూడ సజీవ దహనమయింది. గడ్డివాములు ఇతర సామగ్రి కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రెండులక్షల రూపాయల ఆస్తినష్టం సంభవించింది. బుధవారం రాత్రి బలిజ సన్యాసమ్మ ఇంటివద్ద వంట పనులు ముగించుకుని ఇంటిలోని వారు ఆసుపత్రి పనుల మీద బయటకు వెళ్లగా గాలికి నిప్పురవ్వలు ఎగసి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సన్యాసమ్మకు చెందిన సుమారు 50వేల రూపాయల విలువ చేసే ఆవుదూడ సజీవ దహనమయింది. అలాగే తాటాకు ఇళ్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. బలిజ లక్ష్మికి చెంధిన తాటాకు ఇల్లు దగ్దం కాగా గడ్డివాము బుగ్గయిపోయింది. అద్దెపల్లి వరలక్ష్మికి చెందిన పాక దగ్ధం కాగా ఆవు గాయాలపాలైంది. గడ్డివాము కూడా మంటల్లో కాలిపోయింది. ఇదే వరుసలకు చెందిన షేక్ ఖుర్షిధ్, అల్లం అర్జునమ్మలకు చెందిన పైపులైన్లు, తలుపులు మంటల్లో కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక అధికారి సంజీవరావు ఆధ్వర్యంలోని అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పెనుప్రమాదం సంభవించకుండా మంటలను ఆర్పివేసారు. గురువారం ఉదయం రెవెన్యూ సిబ్బంది బాధితుల ఇళ్లకు వెళ్లి వివరాలను నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సాఆర్ సిపి నాయకులు ఏడువాక సత్యారావు బాధితులను పరామర్సించారు.

బాధితుల డిమాండ్లపై సానుకూల స్పందన
సింహాచలం, గడిచిన పదేళ్ళుగా అసంపూర్తిగా మిగిలిపోయిన సింహాచలం కారిడార్ బిఆర్‌టియస్ రహదారి విస్తరణ పనులకు త్వరలో మోక్షం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు రోజుల కిందట పాఠశాల నూతన భవనాల నిర్మాణ శంకుస్థాపనకు వచ్చిన జివియంసి కమిషనర్ రహదారి విస్తరణ పై ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో గోవులశాల నుండి పైడితల్లమ్మ వారి దేవాలయం వరకు ఉన్న బాధితులంతా కలిసి గురువారం జివియంసి కమిషనర్ హరినారాయణను కలిశారు. బాధితులు కమిషనర్ ముందు తొమ్మిది డిమాండ్‌లను ఉంచారు. వీటిలో ఐదు డిమాండ్‌లకు కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు బాధితులు తెలియజేసారు. మరో రెండు డిమాండ్‌లను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు బాధితుల సంఘం నాయకులు తెలియజేసారు. తొలగిస్తున్న నిర్మాణాలకు ప్రస్తుత బుక్ (రిజిస్టర్) విలువను ప్రమాణికంగా పరివారం చెల్లించాలని,డబుల్ టిడిఆర్‌లు ఇవ్వాలని, దెబ్బతిన్న ఇళ్ళను పునర్నిర్మాణం చేసుకోవడానికి జివియంసి, దేవస్థానం అడ్డుపడకూడదని, 50 శాతానికి పైగా ఇళ్ళు కోల్పోతున్నవారికి అదనంగా 60 గజాల ఖాళీ స్థలం ఇవ్వాలని, గోశాల నుండి పాతఅడివివరం వరకు బిఆర్‌టియస్ కాకుండా రెండు రోడ్లు మాత్రమే ఏర్పాటు చేయాలని కోరిన డిమాండ్ల పై కమిషనర్ సానుకూలత వ్యక్తం చేసినట్లు బాధితుల సంఘం నాయకుడు పాశర్ల ప్రసాద్ తెలియజేసారు. ఖాళీ స్థలాలకు టిడిఆర్‌లు, 50 శాతంలోపు ఇళ్ళు కోల్పోతున్న వారికి ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన స్కీమ్‌లో ఇళ్ళు మంజూరు చేయాలన్న డిమాండ్లను పరిశీలిస్తామని చెప్పినట్లు పాశర్ల తెలిపారు.కమిషనర్‌ని కలిసిన వారిలో బాధితులు గంట్ల కిరణ్‌బాబు, సతివాడ శంకరరావు, సిరిపురపు వెంకటరమణ తదితరులు ఉన్నారు.