విశాఖ

కథ మొదటికొచ్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, దశాబ్దాల కాలంగా నలుగుతున్న పంచగ్రాల భూ సమస్య వ్యవహరం మళ్ళీ మొదటికి వచ్చినట్టయింది. పంచగ్రామాల్లో ఉన్న భూములకు సంబంధించి సింహాచలం దేవస్థానానికి 1996-97 సంవత్సరాల్లో చినగదిలి, పెందుర్తి ఎమ్మార్వోలు ఇచ్చిన పట్టాల పై పునర్విచారణ చేపట్టాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తాజాగా ఆదేశాలు జారి చేసింది. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని, అంతవరకు భూముల పై యథాతధ స్థితిని కొనసాగించాలని పేర్కొంది. దేవస్థానం తన వద్ద ఉన్న పట్టాల ఆధారంగా 2010వ సంవత్సరంలో ఫలసాయం తోటలను వేలం వేయాలని సన్నాహాలు చేసింది. ఈనేపథ్యంలో రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుమారు ఏడేళ్ళ పాటు సాగిన విచారణ అనంతరం తాజాగా హై కోర్టు ఈ ఆదేశాలను జారిచేసింది. న్యాయస్థానం ఆదేశాలతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నప్పటికీ సమస్య మాత్రం మళ్ళీ మొదటికే వచ్చినట్టయింది. విచారణ ఆధికారుల ముందు తమ హక్కులను నిరూపించుకునేందుకు దేవస్థానం, రైతులు సిద్ధమవుతున్నారు. 1863 నాటి ఇనాం ఫెయిర్ రిజిస్టర్, 1930 నాటి ఇనాం బి రిజిస్టర్‌లను ప్రామాణికంగా తీసుకుని హక్కులు నిర్ధారించే అవకాశాలున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి. రైతులు మాత్రం 1903 నాటి గిల్‌మెన్ రికార్డుల్లో ఉన్న ఆధారాల పై ఆశలు పెట్టుకొని ముందుకువెళుతున్నట్లు తెలుస్తోంది. చాలా మంది రైతుల తమ వద్ద 1800 సంవత్సరంలోని రికార్డులు కూడా ఉన్నయని అంటున్నారు. ఏది ఏమైనా ఇనాం అబాలిషన్ యాక్ట్ (చట్టం) పరిధిలోనే విచారణ జరపాలన్నది స్పష్టం కావడంతో హక్కుల పై దేవస్థానం ధీమాగా ఉంది. రైతులు మాత్రం దేవస్థానానికి రెవెన్యూశాఖ ఇచ్చిన పట్టాల పై పునర్విచారణ చేయించే దశకు వ్యవహారాన్ని తీసుకురాగలిగామని భవిష్యత్తులు ఈ సమస్యను తమకు అనుకూలంగా మార్చుకోగలుగుతామని అంటున్నారు.