వరంగల్

రాజకీయ స్వార్థం కోసమే రూరల్ జిల్లా ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల: వరంగల్ రూరల్ జిల్లా కేంద్రాన్ని పరకాలలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం అఖిల పక్షం ఆధ్వర్యంలో స్థానిక నగర పంచాయతీ కార్యాలయం ఎదుట రిలే నిరహార దీక్షను ప్రారంభించారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆవోపా అధ్యక్షులు డాక్టర్ నాగబండి విద్యాసాగర్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సంతోష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా అఖిల పక్షం నేతలు మాట్లాడుతూ వరంగల్ రూరల్ జిల్లా కేవలం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డిల రాజకీయ స్వార్థం కోసం ఏర్పాటు చేసిందే తప్పా ప్రజల కోసం కాదని చెప్పారు. జిల్లా కేంద్రం ఏర్పాటు విషయంలో ఎవరికి ఎంత భూమి ఉన్నాయో అక్కడే జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నేతలు ఉన్నారని పేర్కొన్నారు. నిజాం కాలంలోనే పరకాల తాలుకా కేంద్రంగా ఉందని, రాజకీయ స్వార్థం కోసం ఆనాడు చందులాల్ నేడు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరోసారి పరకాల ప్రాంతానికి అన్యాయం చేసే యోచనలో ఉన్నట్లు స్పష్టంగా కళ్ల ముందు కనబడుతుందని పేర్కొన్నారు. 29న జరిగే సమావేశానికి అఖిల పక్ష నాయకులను ఆహ్వానించాలని వారు డిమాండ్ చేశారు. దీక్షలో పిట్ట వీరస్వామి, కొలుగూరి రాజేశ్వర్‌రావు, పసుల రమేష్, నక్క చిరంజీవి, కానుగుల గోపినాధ్, యాట నరేష్, గట్లగాని శ్రీకాంత్, మంద శ్రీకాంత్, చాడ రవీందర్‌రెడ్డి, అడగాని జనార్దన్, గోవింద, సురేష్, బొచ్చు క్రిష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.